సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ చికిత్స తీసుకుంటూ మృతి..!!

ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ చికిత్స తీసుకుంటూ మృతి చందినట్లుగా సమచారం..

ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ ఆరోగ్యం విషమంగా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హరియాణా గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతి చందినట్లుగా సమచారం.. మరో వైపు కార్యకర్తలు, నాయకుల రద్దీ దృష్ట్యా ఆసుపత్రిలో భద్రతను పటిష్టం చేశారు. ఆసుపత్రిలో ములాయం తనయుడు అఖిలేష్ యాదవ్‌ ఆసుపత్రిలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. దాదాపు మూడేళ్లుగా ములాయం సింగ్‌ యాదవ్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత ఆగస్టు నుంచి ఆరోగ్యం క్షీణించింది. ములాయం ప్రొస్టేట్‌కు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఆయన మేదాంత ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతీ చెందారు..