ఏ తల్లి కన్న బిడ్డ ముళ్ళ పొదల పాలయింది…!

ఏ తల్లి కన్న బిడ్డ ముళ్ళ పొదల పాలయింది..

సూర్యాపేట జిల్లా…
హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం సుల్తాన్ పురం తండా (r&r) పునరావాస కేంద్రం వద్ద అప్పుడే పుట్టిన పాపని ముళ్ళ పొదల్లో పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు….. కన్న పెగే కసాయిగా మారింది.!! కన్నప్పేగే కనికరం లేకుండా చేసిందా..!?. తల్లి ఒడిలో ఉండాల్సిన పాప ముళ్ళ పొదల్లో ఉండటం చూసే ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టించింది……. ఏ తల్లి కన్నదో కానీ పురిట్లో ఉండాల్సిన పసిపాప ముళ్ళ పొదల్లో ఉండడం ప్రతి మనిషిని కదిలించి వేసింది,,..

*పిల్లల డాక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం..*
మట్టపల్లి శివారులో సుల్తాన్పూర్ తండా ఆర్ అండ్ ఆర్ సెంటర్ వద్ద,, రాత్రి పుట్టిన పసిపాపను , ఎవరు ముళ్లపొదల్లో వదిలేశారని సమాచారం,, ఆశా వర్కర్ శాంతి తెలపడంతో,, వెంటనే జిల్లా ఉమెన్స్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు సమాచారం అందించడంతో జిల్లా నుండి వంశీ ,, సాయి వారు సుల్తాన్పూర్ తండా వర్కర్ శాంతి వద్దకు వెళ్లి ఆ చిన్న పాపను తీసుకొని హుజూర్నగర్ ఆసుపత్రిలో చికిత్స చేయించినట్లు తెలిపారు..పాపకి ముళ్ళ బాగా గుచ్చుకోవడం,, తల భాగంలో మరియు వీపు భాగంలో కొంత గాయాలు కావడం బాగా చలికి వదిలి వెళ్లడంతో కొంత ఇబ్బందికి గురైందని తెలిపారు…… ప్రస్తుతం బేబీ ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని అత్యవసరం అయితే సూర్యాపేట కూడా పంపిస్తామని తెలిపారు…

*ఆశ వర్కర్ శాంతి తెలిపిన వివరాల ప్రకారం..*

తమ గ్రామంలో ఉదయాన్నే ముళ్లపొదల్లో బేబీ ఉన్నదని సమాచారం చర్చ జరగడంతో శాంత కుమారుడు వెళ్లి చూసొచ్చి ముళ్ళపదల్లో బేబీ ఉన్నదని చెప్పడంతో హుటాహుటిన వెళ్లి ఆ బేబీని తన ఇంటికి తీసుకువచ్చి,, అధికారులకు సమాచారం అందించినట్లు ఆమె తెలిపారు.. బేబీ ఎక్కడి నుండి వచ్చింది ఏమిటి అనేది మాత్రం తనకు తెలువదని తెలిపారు…