ముంబై బాంద్రాలో అగ్నిప్రమాదం ..

ముంబై బాంద్రాలో అగ్నిప్రమాదం సంభవించింది. బృహన్ ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ బస్సులో ఉన్నఫళంగా భారీగా మంటలు చెలరేగాయి. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై బస్సు అగ్నికి ఆహుతైంది. ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు, డ్రైవర్, కండక్టర్ భయాందోళనతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. భారీ ఎత్తున ఎగసిపడుతున్న మంటలను అదుపు చేశారు. ఘటనకు సమీపంలో పెట్రోల్ బంక్ ఉండటంతో మంటలు వ్యాపించకుండా ఆర్పేశారు. దీంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అప్రమత్తతోనే పెనుప్రమాదం తప్పిందని ప్రయాణికులు, స్థానికులు తెలిపారు..