ఉత్కంఠ పోరులో గుజరాత్‌ విజయం..!!

ముంబై ఇండియన్స్ (Mumbai Indians)పై ఈ సారి స్పెషల్ ఫోకస్ నెలకొంది. కారణం.. కెప్టెన్సీ మార్పు అనంతరం హార్దిక్ పాండ్యా ఫస్ట్ టైం జట్టుకు నాయకత్వం వహించడం. అంతేకాకుండా.. ఇన్నాళ్లు కెప్టెన్ గా వ్యవహరించిన రోహిత్.. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ఎలా ఆడతాడన్న దానిపై ఆసక్తి నెలకొంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది…

ఆ ప్లేయర్ ఎవరో కాదు ఇషాన్ కిషన్. మానసిక అలసట కారణంగా దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధంతరంగా స్వదేశానికి వచ్చిన ఇషాన్ కిషాన్ ఆదివారమే పోటీక్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. టీమిండియాలో చోటు కోల్పోవడం, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకోకపోవడం వంటి ప్రతికూలతల మధ్య ఇషాన్ రీ ఎంట్రీ గురించి అందరూ చర్చించుకున్నారు..అయితే ఓపెనర్ బరిలోకి దిగిన ఇషాన్ నాలుగు బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. సత్తా చాటుతాడనుకున్న ఇషాన్ ఇలా డకౌటవ్వడం ఫ్యాన్స్ కు ఏ మాత్రం నచ్చలేదు. దీంతో ఇషాన్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయావని.. ఇలాగే ఆడితే జన్మలో జట్టులోకి తీసుకోరని కామెంట్లు చేస్తున్నారు.

ఐపీఎల్-17లో గుజరాత్ టైటాన్స్ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్కు షాకిస్తూ బోణీ కొట్టింది. మరోవైపు, తొలి మ్యాచ్ను ఓటమితో ప్రారంభించే సంప్రదాయాన్ని ముంబై జట్టు ఈ సీజన్లోనూ కొనసాగించింది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం రాత్రి ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ముంబైపై 6 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌ (45), గిల్‌ (31), తెవాటియా (22) రాణించారు. బుమ్రాకు మూడు, కొట్జీకి రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు చేసి ఓడింది. బ్రెవిస్‌ (46), రోహిత్‌ (43), తిలక్‌ (25) ఆకట్టుకున్నారు. స్పెన్సర్‌ జాన్సన్‌, ఉమేశ్‌, ఒమర్జాయ్‌, మోహిత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా సాయి సుదర్శన్‌ నిలిచాడు. కాగా గత 11 ఏళ్ల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఐపీఎల్ సీజన్‌లో కూడా ముంబై మొదటి మ్యాచ్ లో ఓటమిపాలైంది..