ముంబైలో హై అలర్ట్…. పాక్ తీవ్రవాదుల దాడి జరగవచ్చు..!

ముంబైలో హై అలర్ట్ ప్రకటించాయి. పాక్ ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రవాద చర్య జరిగే అవకాశముందని ముంబైలో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసింది..పోలీసులు అప్రమత్తం అయ్యారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరాన్ని డాగ్‌ స్క్వాడ్‌, బాంబు స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ముంబైలో తనిఖీలు పెంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ముందస్తు చర్యలు చేపట్టారు. రద్దీ ప్రాంతాల్లో వాహానాల తనిఖీలు, నాకాబంధీ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసారు. మరోవైపు అన్ని పోలీస్ స్టేషన్లకు కీలక ఆదేశాలు జారీచేశారు. సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశించారు. గుంపులు గుంపులుగా తిరగవద్దని వీలయినంతవరకు ఇంటికి పరిమితం కావడం మంచిదని సూచించారు. ముంబైలో భద్రతా బలగాలు, పోలీసులు అలర్ట్ అయ్యారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. షాపింగ్‌మాల్స్, బస్టాండ్లు, దేవాలయాల్లో సోదాలు చేస్తున్నారు. నగరవ్యాప్తంగా బాంబ్ స్క్వాడ్‌తో శోధిస్తున్నారు. ఉగ్రవాదులు పేలుడు పదార్థాలను ఉపయోగించి పేలుళ్లకు పాల్పడాలని యోచిస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ సమాచారంతో ముంబై అలర్టయింది..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959