మంత్రి చేస్తానని పవన్‌ కళ్యాణ్ మోసం చేశాడు…!

మంత్రి చేస్తానని పవన్‌ కళ్యాణ్ మోసం చేశాడంటూ జనసేన ముమ్మిడివరం ఇంఛార్జి పితాని బాలకృష్ణ షాకింగ్‌ కామెంట్స్ చేశారు. జనసేన ముమ్మిడివరం ఇంఛార్జి పితాని బాలకృష్ణ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్‌ ను కలవడానికి ప్రయత్నం చేస్తున్నాను..రెస్పాన్స్ కావడం లేదని ఫైర్ అయ్యారు. నన్ను మంత్రి చేస్తాను అన్నారు…ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

Mummidivaram Janasena Incharge Pithani Balakrishna comments on pawan kalyan

పవన్ అన్ని కులాలకు ఆవకాశమిచ్చారు శెట్టి బలిజ లకు ఎందుకు ప్రాధాన్యత లేదన్నారు. నాకు సరైన హామీ ఇవ్వకుండా ఎలా పని చేయగలనని వివరించారు.
వైసీపీ తో పాటు అన్ని పార్టీలు నన్ను తమ పార్టీలోకి రావాలని అడుగుతున్నారన్నారు. పవన్ ను కలిసే అవకాశం వస్తే కలిసిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు జనసేన ముమ్మిడివరం ఇంఛార్జి పితాని బాలకృష్ణ.