మునుగోడు ఉపఎన్నిక కోసం తరలిస్తున్న రూ.89.91లక్షల నగదు స్వాధీనం..!

మునుగోడు ఉపఎన్నిక కోసం తరలిస్తున్న రూ.89.91లక్షల నగదును హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు._ ముందస్తుగా అందిన సమాచారం మేరకు జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్‌ సమీపంలో దాడులు నిర్వహించగా.. ఓ కారులో తరలిస్తున్న నగదు పట్టుబడింది.

కారులో ఉన్న వ్యక్తిని కడారి శ్రీనివాస్‌గా గుర్తించారు. ఆయన భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ వ్యక్తిగత సహాయకుడు జనార్దన్‌కు డ్రైవర్‌గా తేల్చారు. నగదును జూబ్లీహిల్స్‌లోని త్రిపుర కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ నుంచి మునుగోడు తరలిస్తున్న క్రమంలో పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. కారు, నగదును స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.