మునుగోడు ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల పర్వం..!!

మునుగోడు ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల పర్వం..

మునుగోడు

మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది. వందకు పైగా నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవాళ ఒక్కరోజే 50కి పైగా నామినేషన్లు

రేపు, ఎల్లుండి నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 17.

ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయా పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. నవంబర్ 3న పోలింగ్‌ నిర్వహించనున్నారు. 6న ఓట్ల లెక్కించి, ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇక టీఆర్‌ఎస్ పార్టీ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్య ప్రధాన పోటీ ఉంది.

2018 ఎన్నికల సమయంలో మునుగోడులో మొత్తం 33 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే చివరగా 15 మంది మాత్రమే బరిలో ఉన్నారు. అయితే ఇది ఉపఎన్నిక కావడంతో నామినేషన్లు పెద్ద సంఖ్యలో దాఖలయ్యాయి.

మునుగోడు.. నియోజకవర్గంలో…
నిన్నటితో ముగిసిన నామినేషన్ల పర్వం….
నిన్న 11 గంటల వరకు సాగిన నామినేషన్ ల ప్రక్రియ….
………….
Total 130 candidates
199 sets of Nominations filed .