మునుగోడు ఎమ్మెల్యే గా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం!..

ఇటీవల మునుగోడు నూతన ఎమ్మెల్యే గా గెలుపొందిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 11 గంటలకు శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారు, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు మరియు రోడ్లు,భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి గార్లు, సహా పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ లు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించటంతో అసెంబ్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఆరుగురు ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్‌ బలం రాజగోపాల్‌రెడ్డి ఓటమితో ఐదుకు పడిపోయింది…