ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్..
.ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.
చౌటుప్పల్ మండలం……
దండు మల్కాపూర్ గ్రామం లో
67 వ బూత్ లో
Total votes : 1113
1051 votes 94.5%..
చౌటుప్పల్ మండలం ,
*అంకిరెడ్డిగూడెం గ్రామంలో మొత్తం ఓట్లు 1245*
*పోలైన ఓట్లు 1192*
*పోలుగాని ఓట్లు 53..
చౌటుప్పల్ మండలం…..
కుంట్లగూడెం లో మొత్తం ఓట్లు:- 1229
పోలైన ఓట్లు 1,175
6.వ బూత్ లో616 ఓట్లు
M-302
F-314. Tolal 616
7వ, బూత్ లో
559ఓట్లు
M-303
F-256 Total 559ఓట్లు
ఓటు హక్కు ని వినియోగించుకొని వాలు 54 మంది
పోలింగ్ శాతం 97%..
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో నీ …..
తాళ్ల సింగారం బూత్ నెంబర్ 29 లో 1302 ఓట్లకు గాను 1254 ఓట్లతో 96.31 శాతం నమోదు కావడం జరిగినది.
మునుగోడు ఉప ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లు ఉన్నాయని పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో నిల్చున్న వారందరికీ ఓటరు స్లిప్పులు ఇచ్చామని తెలిపారు. పోలింగ్ మొత్తం పూర్తయ్యేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాల బయట స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయని తెలిపారు. మునుగోడులో 3 చోట్ల ఈవీఎంలు, 4 వీవీప్యాట్‌లు మార్చారు..
తెలంగాణ వ్యాప్తంగా అమితాసక్తి రేకెత్తించిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో గురువారం సాయంత్రం 6 గంటలకు కీలక ఘట్టం పూర్తయింది. మునుగోడు ఎన్నికలో పోలింగ్ ముగిసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే పోలింగ్ ముగిసే సమయానికి నియోజకవర్గ వ్యాప్తంగా చాలా పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరి నిలబడ్డారు..
మునుగోడు ఉపఎన్నికలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. తొలుత మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నానికి ఊపందుకుంది. మునుపెన్నడూ లేని రీతిలో ప్రజాస్వామ్య స్ఫూర్తి కనబరిచిన మునుగోడు మహిళలు, యువత.. తమ ఓటుహక్కును ఉత్సాహంగా వినియోగించుకున్నారు. పలుచోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు రావడంతో ఓటర్లు కాసేపు వేచిఉండాల్సి వచ్చింది. మరమ్మతుల అనంతరం.. పోలింగ్ సాపీగా సాగింది. కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వెబ్‌క్యాస్టింగ్ ద్వారా ఎన్నికల సంఘం నిరంతరం పర్యవేక్షించింది. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా నియోజకవర్గవ్యాప్తంగా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.