మునుగోడు ఉప ఎన్నికల్లో నేడు 9 నామినేషన్లు…!!

నల్గొండ,అక్టోబర్ 11. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో మంగళవారం
9 నామినేషన్లు రిటర్నింగ్ అధికారికి దాఖలు చేశారు.స్వతంత్ర అభ్యర్తులు గా మచ్చ సుధాకర్ రావు రెండు సెట్లు,పి.భవాని రెండు సెట్లు,ఈద శేషగిరి రావు రెండు సెట్లు, మాద గొని వెంకటేశ్వర్లు ఒక సెట్,కొలి సెట్టి శివ కుమార్ యుగ తులసి పార్టీ తరపున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. బేరి వెంకటేష్ స్వతంత్ర అభ్యర్థి గా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు.కాగా బేరి వెంకటేష్ సోమ వారం ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు