మునుగోడు ఉప ఎన్నిక కు ప్రారంభమైన పోలింగ్…

మునుగోడు ఉప ఎన్నిక కు ప్రారంభమైన పోలింగ్…

ఉప ఎన్నిక నిర్వహణకు పటిష్ట చర్యలు.

• ఓటు వినియోగానికి గుర్తింపు కార్డు తప్పనిసరి.

*మొత్తం ఓటర్లు 2,41,855*

_పురుషులు 1,21,720_

_స్త్రీలు 1,20,128_

ప్లయింగ్ స్క్వాడ్,స్టేట్ సర్వేలైన్స్ టీమ్ లు 14

పోలింగ్ కేంద్రాలు 298

వీడియో సర్వేలైన్స్ టీమ్లు 14

సమస్యాత్మక కేంద్రాలు 105

మైక్రో అబ్జర్వర్లు 199

ఈవీఎంలు 1192, వీవీ ప్యాట్లు596,

కంట్రోల్ యూనిట్లు 596

పోలీస్ సిబ్బంది 3,365

చెక్ పోస్టులు 100

ఒక్కో కేంద్రంలో ఈవీఎంలు 3

కేంద్ర బలగాలు 15 కంపెనీలు

మునుగోడు ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకున్నది. అభ్యర్థుల భవితవ్యం తేల్చే పోలింగ్ నేడు ఉదయం 7 నుంచి ప్రారంభమైంది.సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుండగా, ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చండూరులోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి బుధవారం రోజే ఎన్నికల సిబ్బంది సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు .ఉప ఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు ఉన్నారు. 298 పోలింగ్ స్టేషన్లలో 2,41,855 మంది ఓటు వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.ప్రధాన రాజకీయ పార్టీల ఘర్షణల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.పోలింగ్ తీరును రాచకొండ కమిషనరేట్ నుండి వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు.పోలింగ్ అనంతరం ఈవీఎంలను నల్లగొండకు తరలించి స్ట్రాంగ్
రూమ్ లో భద్రపర్చనున్నారు.

పారదర్శకంగా పోలింగ్ జరిగేందుకు ఈసీ కసరత్తు.

ఉప ఎన్నిక నిర్వహణకు పటిష్ట చర్యలు

వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ

వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు

ఈ సారి కొత్తగా డిజిటల్ స్లిప్పులు ఓటు వినియోగానికి గుర్తింపు కార్డు తప్పనిసరి

అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పటిష్ట భద్రత.

యాదాద్రి భువనగిరి జిల్లా:

సంస్థ నారాయణపురం మండలం లింగవారి గూడెం గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్న టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు…..