మునుగోడు బైపోల్ ప్రచారానికి వెళ్లను ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యలు…!!

మునుగోడు బైపోల్ ప్రచారానికి వెళ్లను.. అందుకేనంటూ ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యలు
మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. టీఆర్ ఎస్, బీజేపీకి చెందిన గ్రామస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి నాయకులంతా మునుగోడు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ లో నాయకుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తూనే..
నామినేషన్ల పర్వం ముగిసి, ప్రచారంలో అన్ని పార్టీలు నిమగ్నమైన సందర్భంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున మునుగోడులో ప్రచారం చేయబోనని తేల్చి చెప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి. వాస్తవానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తారని హస్తం పార్టీ నాయకులకే నమ్మకం లేదు. అయినా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వెంకటరెడ్డితో ప్రచారం చేయించి, తమ్ముడి నిర్ణయాన్ని సొంత సోదరుడే సమర్థించడం లేదనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తాను ప్రచారానికి వెళ్లబోనని స్పషం చేశారు.