మునుగోడు టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థికి బి ఫామ్ అందజేసిన సీఎం కేసీఆర్..

మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి, సిఎం కెసిఆర్ పార్టీ బీ ఫామ్ ను ప్రగతి భవన్ లో శుక్రవారం అందచేసారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ నిధినుంచి రూ.40 లక్షల చెక్కును అందచేశారు. తనకు అభ్యర్థిగా అవకాశమిచ్చినందుకు సిఎం కెసిఆర్ కి కూసుకుంట్ల ఈ సందర్భంగా కృతజ్జతలు తెలిపారు.
ఈ సందర్భంగా నల్గగొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు,మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి తదితరులున్నారు.