మునుగోడు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఖరారు..!!

తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు గురించి రోజుకో కొత్త చర్చ తెరపైకి వస్తోంది. ఇన్నాళ్లు రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై చర్చ జరిగింది. ఇప్పుడు ఆయన రాజీనామా చేయడంతో.. ఉప ఎన్నిక అనివ్యార్యమైంది. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఆ స్థానంపై కన్నేశాయి. అయితే.. అసలు సమస్య అభ్యర్థుల ఎంపిక దగ్గరే వస్తోంది. పోటీచేసే అభ్యర్థులు ఎవరిని దానిపై తెరాస పార్టీ దాదాపు క్లారిటీ ఇచ్చింది…

టీఆర్‌ఎస్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (Prabhakar Reddy Kusukuntla)ని బరిలో ఉండబోతున్నారంటూ సంకేతాలు కనిపిస్తున్నాయి. కొన్ని సర్వేల్లో, అభిప్రాయ సేకరణలో కూసుకుంట్ల పేరే ప్రముఖంగా వినిపించినట్టు తెలుస్తోంది..

టిఆర్ఎస్ పార్టీ తరపున మునుగోడు బరిలో దిగనున్న మాజి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి….ఖరారు చేసిన సిఎం కేసిఆర్

ఈ నెల 20న సంస్దాన్ నారాయణ పూర్ లో జరుగనున్న ప్రజా దీవెన సభలో ప్రకటించనున్న సిఎం కేసిఆర్….!!

టికెట్ కేటాయింపుకు ఇదే కారణం..!!

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన తన గురువు కళ్ళెం యాదగిరి రెడ్డితో కలిసి ప్రభాకర్ రెడ్డి 2002లో తెలంగాణ రాష్ట్ర సమితి చేరాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర సాధన కోసం పోరాడాడు. మునుగోడు ప్రాంతంలో రాష్ట్ర సాధనకోసం జరిగిన అనేక ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డి, అక్కడి ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందాడు. ప్రభాకర్ తల్లి ఫ్లోరోసిస్ బాధితురాలు. ఈ ప్రాంతంలో ఫ్లోరోసిస్ బాధితులు ఎక్కువగా ఉండేవారు.

ఓడిపోయిన సానుభూతి కూడా వర్కౌట్ అవుతుందని ఓ ఆలోచన కూడా…

2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా అత్యధికంగా 38,055 ఓట్ల మెజారిటీతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు..

దాదాపు బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కావడం.!

ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తి క్లారిటీకి రాలేకపోతోంది.!!..