నల్లగొండ జిల్లా కేతపల్లి మండలం మూసి ప్రాజెక్ట్ హైదరాబాద్,ఎగువ ప్రాంతంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్ట్ కు వరద తాకిడి భారీగా పెరిగింది.. ప్రస్తుత ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులకు గాను 642.20 అడుగులకు చేరటంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు
మూసి ప్రాజెక్టు నాలుగు క్రస్ట్ గేట్లు రెండు ఫీట్ల మేరా పైకి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు .4977 క్యూసెక్కుల నీటిని నాలుగు గేట్ల ద్వారా దిగువకు విడుదల చేశారు అధికారులు..అదేవిధంగా లెఫ్ట్ కెనాల్ నుండి 141′ క్యూసెక్కులు, మరియు రైట్ కెనాల్ నుండి 94′ క్యూసెక్కుల చొప్పున నీటిని రైతుల పంట పొలాలకు విడుదల చేస్తున్నారు..
మూసి ప్రాజెక్టు పరిసర ప్రాంత దిగువ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని . మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో చేపల వేటకు వెళ్ళవద్దని అధికారులు.హెచ్చరికలు జారీ చేశారు
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం
*మూసి ప్రాజెక్టు ప్రస్తుత సమాచారం*
4గేట్ల నుండి4977 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
ఇన్ ఫ్లో : 5,212 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 5,212 క్యూసెక్కులు
ప్రస్తుత నీటి నిల్వ : 3.74 tmc
పూర్తిస్థాయి నీటి నిల్వ: 4.46tmc
ప్రస్తుత నీటిమట్టం: 642.20 అడుగులు
పూర్తిస్థాయి నీటిమట్టం: 645అడుగులు…