మత సామరస్యాని చాటిన ముస్లిం సోదరులు..అయ్యప్ప స్వాముల సేవలో పాల్గొన్న ముస్లిం యువకులు….

మత సామరస్యానికి నిదర్శనం కొత్తకోట. అయ్యప్ప స్వాముల సేవలో పాల్గొన్న ముస్లిం యువకులు.. వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రము లోని మార్కండేయ స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి మాల ధరించి దీక్ష చేస్తున్న అయ్యప్ప స్వాములకు ,కొత్తకోట కు చెందిన షేక్ అలిబాబా మిత్ర బృందం ఆధ్వర్యంలో భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో కుల మతాలకు అతీతంగా ముస్లిం సోదరులు స్వయంగా అయ్యప్ప స్వాములకు భిక్ష వడ్డించారు. రెండు సంవత్సరాల నుండి కరోన ప్రబలిన నేపథ్యంలో చేయలేకపోయామని, ప్రస్తుత పరిస్థితులో అయ్యప్ప స్వామి మాకు ఇంత అవకాశం ఇచ్చిన నేపథ్యంలో భిక్ష కార్యక్రమం లో సేవ చేయడానికి ,ఈ అవకాశాన్ని ఇచ్చిన అయ్యప్ప స్వామికి మరియు మాల వేసుకున్న అయ్యప్ప స్వాములకు నమస్కారించి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు షేక్ అలిబాబా తెలిపారు. ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అలిబాబా మిత్ర బృందాన్ని అయ్యప్ప స్వాములు నాగరాజు గురు స్వామి. రఘు గురుస్వామి. లింగేశ్వరగురుస్వామి. సుధాకర్ రెడ్డి గురుస్వామి లు అభినందించారు. ఈ కార్యక్రమములో అలిబాబా, హాలీమ్, వాజీద్, పాషా, అమీర్, రంజిత్ కుమార్, భరత్, ప్రవీణ్ కుమార్ , తదితర సభ్యులు పాల్గొన్నారు..