Myositis వ్యాధి తో బాధపడుతున్న సమంత
చికిత్స తీసుకుంటున్న సమంత
చికిత్స తీసుకుంటున్న ఫోటో షేర్ చేసిన సమంత..
గత కొద్దిరోజులుగా సమంత ఒక చర్మ వ్యాధితో బాధపడుతున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సమంత తాజాగా తన వ్యాధి గురించి అందరికీ చెప్పింది. యశోద సినిమా ట్రైలర్‌కు వచ్చిన ఇచ్చిన రెస్పాన్స్ చూసి నాకు చాలా సంతోషంగా ఉందని అంటూ ఒక పోస్ట్ షేర్ చేసిన ఆమె దే మీకు, నాకు మధ్య ఉన్న బంధం. అదే ప్రేమతో నేను ఈ కష్టాలన్నింటిని ఎదుర్కొంటున్నానని పేర్కొన్నారు. నా మీద విసిరే రాళ్లను కూడా తట్టుకుంటున్నానని పేర్కొన్న ఆమె తాను మ్యూసిటిస్ (కండరాల బలహీనత, ఎక్కువ సేపు నిల్చోలేకపోవడం నడవ లేకపోవడం, నీరసంగా ఉండటం దాని లక్షణాలు) అనే వ్యాధితో బాధపడుతున్నానని వెల్లడించింది.
ఇదంతా మీకు చెప్పాలని అనుకున్నాను కానీ కాస్త ఆలస్యంగా చెబుతున్నాను. అయితే మనం ప్రతీదీ ఇలా బయటకు వచ్చి చెప్పాల్సిన పని లేదని నేను అనుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. మనకు ఎదురయ్యే సవాళ్లను అంగీకరిస్తూ ముందుకు వెళ్లాల్సిందే. త్వరలోనే కోలుకుంటానని వైద్యులు చెప్పారు. మానసికంగా, శారరీకంగా నేను ఎన్నో కష్టాలను చూశా, ఇక ఇవి నేను భరించలేననేంత స్థాయిలోనూ కష్టాలు వచ్చాయి.. కానీ అవన్నీ ఎలాగో గడిచిపోయాయి. ఇక ఇది కూడా త్వరలోనే సమసిపోతుంది అని ఆశిస్తున్నాను అంటూ సమంత చెప్పుకొచ్చింది…
లక్షణాలు : ఈ వ్యాధిలో కూడా పోలీమ్యోసిటిస్‌కు ఉన్న లక్షణాలే ఉంటాయి. అయితే, ఇందులో దద్దుర్లు కూడా ఉంటాయి. కండరాల్లో నొప్పి రావటానికి ముందే ఎరుపు, పర్పుల్, నల్లటి దద్దుర్లు కనిపిస్తాయి. కనురెప్పలు, ముక్కు, బుగ్గలపై దద్దుర్లు వస్తాయి. ఒక్కోసారి ఇవి నడుము, పై రొమ్ము, మోకాళ్లపై వస్తుంటాయి. ఈ వ్యాధిలో దద్దుర్లు దురదను కలిగించటంతోపాటు నొప్పిగా కూడా ఉంటాయి. చర్మం కింద గట్టి గుజ్జుకూడా ఉంటుంది..
ఈ వ్యాధిని తగ్గించుకోవటానికి ఏం చేయాలి
వైద్యుల సంరక్షణలో చికిత్స తీసుకోవటం ఎంతో ముఖ్యం. వారు చెప్పిన విధంగా వ్యాయామం చేయటం ఎంతో ఉపయోగపడుతుంది. కండరాళ్ల వాపును తగ్గించటంతో పాటు కొత్త శక్తిని ఇస్తుంది. ఫిజియోథెరపీ కూడా అన్ని రకాల మైసిటిస్‌ను తగ్గించటానికి ఉపయోగపడుతుంది. ఈ వ్యాధిని సరైన సమయంలో గుర్తించి.. స్టేజీలకు తగిన విధంగా చికిత్స చేయించుకోవాలి. సరైన చికిత్స అందకపోయినా.. అసలు చికిత్స తీసుకోకపోయినా నష్టం తప్పదు. ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది.