త్వరలో నారా లోకేష్‌ అరెస్ట్..!!

చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీ రాజకీయం భగ్గుమంటోంది. వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే.. మాకు టైమ్ వస్తుంది మేమేంటో చూపిస్తామని టీడీపీ నేతలు, కార్యకర్తలు సవాల్ విసురుతున్నారు.
నారా లోకేష్ కూడా స్కాంలు చేశాడు

ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ నిధుల మల్లింపుల్లో లోకేష్ పాత్రపై దర్యాప్తు జరుగుతుంది. ఈ రెండింటిలో లోకేష్ పాత్ర ఉన్నట్లు తేలింది – ఏపీ సీఐడీ చీప్ సంజయ్ కుమార్..

వీడియో లింక్ క్లిక్ చెయ్యండి.
https://youtu.be/lrodzx7FDJE?si=fiTLHna5b7F5oIn-

చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు.. ఆయనను ఊళ్లల్లో తిప్పిన విధానం తెలుగు తమ్ముళ్లకు తప్ప పడుతున్నట్లు తెలుస్తోంది… స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయగా.. ఇదే కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయ్.

ఇప్పుడు సీఐడీ చీఫ్ వ్యాఖ్యలతో త్వరలోనే లోకేష్‌ను కూడా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేస్తారేమోననే టెన్షన్ టీడీపీ వర్గాల్లో నెలకొంది. ఒకవేళ లోకేష్‌ను కూడా అరెస్ట్ చేస్తే యువగళం పాదయాత్ర నిలిచిపోయే అవకాశముంది. దీంతో చంద్రబాబుతోనే సరిపెడతారా.. లేదా రానున్న రోజుల్లో మరిన్ని అరెస్ట్‌లు ఉంటాయా అనేది టీడీపీ వర్గాలను టెన్షన్ పెడుతోంది..

అంతకుముందు

శుక్రవారం అర్ధరాత్రి మొదలైన అరెస్టు హైడ్రామా శనివారం ఉదయం వరకు కొనసాగింది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసి అమరావతికి తరలించారు. చంద్రబాబు అరెస్ట్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు.

చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నారా లోకేశ్‌ నిరసనకు దిగారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నారనే సమాచారంతో కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ నుంచి లోకేశ్‌ విజయవాడ బయలుదేరేందుకు సిద్ధం అయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆయనను అడ్డుకోవడం ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది..