కోహిమా: నాగాలాండ్‌లోని (Nagaland) చమౌకేడిమా (Chumoukedima) జిల్లాలో ఘోర ప్రమాదంజరిగింది. భారీ వర్షాలకు కొండచరియలు (Landslide) విరిగిపడటంతో ఓ పెద్ద బండరాయి (Giant boulders) అమాంతం రెండు కార్లపైకి దూసుకొచ్చింది. దీంతో ఒకరు అక్కడిక్కడే మరణించగా, మరొకరు దవాఖానలో చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిప పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.