నేను త్వరలోనే బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతా : నాగం జనార్దన్‌రెడ్డి..

TS: నాగం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు కలిసి బీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నాగం మీడియాతో మాట్లాడారు. కార్యకర్తల కోరిక మేరకు కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు వెల్లడించారు..కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం, ప్రగతి భవన్ లో బిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుతో మర్యాద పూర్వకంగా భేటీ అయిన తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి, నాగం జనార్దన్ రెడ్డి.

నాగర్‌ కర్నూల్‌ భవిష్యత్‌ కోసం బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌ అధ్వాన్న స్థితిలోకి చేరిందని, చేవేళ్ల కాంగ్రెస్‌ సభకు 50వేల మందిని తరలించినట్లు తెలిపారు. ఉదయ్‌పూర్‌ డిక్లరేసన్‌ను కాంగ్రెస్‌ తుంగలో తొక్కిందని విమర్శించారు. డబ్బులు ఉన్న వారికే కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చిందని దుయ్యబట్టారు. పార్టీ జెండాలు మోసిన వారికి కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వడం లేదన్నారు. మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి పని చేస్తానన్నారు. నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌ అవమానించిందని మర్రి జనార్దన్‌రెడ్డి విమర్శించారు. నాగంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నాగం జనార్దన్‌రెడ్డికి తాను కుమారుడి లాంటివాడనన్నారు.