రేవంత్ రెడ్డి నమ్మకద్రోహి..డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నాడు. – నాగం జనార్దన్ రెడ్డి..

జూపల్లి కృష్ణారావును వదిలిపెట్టొడు - నాగం జనార్దన్ రెడ్డి.

రేవంత్ రెడ్డి నమ్మకద్రోహి..డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నాడు.. నాగర్కర్నూల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తదో చూస్తా – నాగం జనార్దన్ రెడ్డి

పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా పైసలు ఇచ్చినోళ్ళకి మాత్రమే పార్టీ టికెట్లు ఇస్తుండు.

ఎలా రాష్ట్రంలో నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాకుండా ఎన్నికల కోసం పారాషూట్ లో వచ్చిన నాయకులకు టికెట్లు ఇస్తున్నాడు.

రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన నాగం జనార్ధన్ రెడ్డి.

కాంగ్రెస్ అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నాడు.

కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి నమ్మకద్రోహం చేసిన వ్యక్తులకు నాగర్కర్నూల్ టికెట్ ఇవ్వడం పెద్ద వింత.

తండ్రి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉంటాడు కొడుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉంటాడు ఇలాంటి వారికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం రేవంత్ రెడ్డి వ్యవహార శైలికి నిదర్శనం.

పదేళ్లుగా ప్రభుత్వంపై ఎన్నో కేసులు వేసి బీఆర్ఎస్ పార్టీ నాయకుల చేతిలో ఎన్నో తిట్లు తిని ఎన్నో కేసులు అనుభవిస్తున్న తనకు టికెట్ ఇవ్వకుండా వచ్చిన అభ్యర్థికి టికెట్ ఇవ్వడం.

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తే తనకు పార్టీ టికెట్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి నమ్మకద్రోహం చేసాడని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాగం మాట్లాడారు. తాను ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఔన్నత్యానికి, పటిష్టతకు కృషి చేస్తే నియోజకవర్గ హద్దులు, సమస్యలు తెలియని ప్యారషూట్ అభ్యర్థికి టికెట్ ఎలా కేటాయిస్తానని ప్రశ్నించారు. టికెట్ ఎందుకు ఇవ్వడం లేదో అడిగితే అధిష్టానం నుంచి సమాధానం రావడం లేదన్నారు. బీఆర్ఎస్లో టికెట్టుకు అర్హతలేని పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్లో హీరోలయ్యారన్నారు. పైసలు ఉన్నవాళ్లను చూసే టికెట్లు ఇస్తున్నారన్నారు. పొంగులేటి దగ్గర పైసలెక్కడి నుంచి వచ్చినయో తన దగ్గర లెక్కలున్నాయన్నారు. 2018లో బీఆర్ఎస్లో చేరి కాంగ్రెస్ను విలీనం చేయాలన్న కూచకుళ్ల కుమారుడికి టికెట్ ఎలా ఇస్తారని, రేవంత్ రెడ్డికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. పార్టీ కోసం కేసులు వేయడానికి మాత్రమే తాము పనికొస్తామా అని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్లు తనకు టికెట్ కూచకుళ్ళకా..? అని కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించారు. తన లాంటి వాడికే అన్యాయం చేస్తారా..? అని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిపై పోరాటం చేయడమే తనకు ప్రతిభంధకమా అని ప్రశ్నించారు. బిజినేపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ పెట్టి పార్టీ ఇమేజ్ పెంచానన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు జనం సమీకరించి, పార్టీ గౌరవం కాపాడానన్నారు. అధిష్టానం చెప్పిన ప్రకారం ఉదయపూర్ డిక్లరేషన్ అమలు కావడం లేదన్నారు. ఐదు సంవత్సరాలు పని చేసిన వారికే పార్టీ టికెట్ అని కొత్తగా పార్టీలో చేరిన వారికి ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ కోసం తవ్వుతుంటే పందికొక్కుల బొక్కలు తీస్తున్నారని కూచకుళ్ళ ఎద్దేవా చేశారన్నారు. 2016లో ఎమ్మెల్సీగా కూచకుళ్లను తాను గెలిపిస్తే, 2018లో తనను ఓడగొట్టి కూచకుళ్ల ప్రతీకారం తీర్చుకున్నాడన్నారు. . సీనియర్ నాయకులు మాణిక్ రావు ఠాక్రే, జానారెడ్డి, చిన్నారెడ్డి, పార్లమెంట్ ఇంచార్జ్ మన్సూర్ అలీ తనతో చర్చించారన్నారు. టికెట్ల విషయంలో జరిగిన అన్యాయం రాహుల్ గాంధీ వరకు తీసుకెళ్తానన్నారు. బీజేపీ నుంచి ఫోన్లో సంప్రదింపులు జరిపినట్లు విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయకుంటే కాంగ్రెస్ టికెట్ ఎవరైనా అడిగేవారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పాటు నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి ఏడవ గ్యారెంటీ ఇవ్వాలన్నారు. కూచకుళ్ళ తండ్రి కొడుకులు పార్టీ మారరని అధిష్టానం గ్యారెంటీ ఇవ్వాలన్నారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే భవిష్యత్తు కార్యాచరణ చేపడతానన్నారు..

పార్టీ కోసం కష్టపడిన జగదీశ్వర్ రావుకి కాకుండా పారాచూట్ నాయకుడు జూపల్లికి టికెట్ ఇచ్చారు. జూపల్లిని వదిలిపెట్టేది లేదు, దానికోసం నా సాయం మీకు ఉంటది..