*బ్రేకింగ్…*
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలనీలో దారుణం ….
గంజాయి మత్తులో స్నేహితుని గొంతు కోసిన నితిన్….
బాధితుడు విష్ణును ఆస్పత్రికి తరలించిన సహచరులు….
గొంతు కోసిన నిందితుడు నితిన్ ఏఎస్ఐ భిక్షమయ్య కొడుకుగా గుర్తింపు…
పరారీలో నిందితుడు నితిన్…
ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు….
గంజాయి మత్తులో కొందరు యువకులు చిత్తవుతున్నారు. విలువైన భవిష్యత్‌ను కోల్పోతున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లా పాల్వంచలో ఇద్దరు యువకులు మోటార్ సైకిల్‌పై వెళుతూ డివైడర్‌కు ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, తోటి విద్యార్థులు, స్నేహితులు భారీ సంఖ్యలో చూసేందుకు వచ్చారు. వచ్చిన వారంతా మత్తులో జోగుతూ రచ్చ చేశారు. వారంతా మద్యం, గంజాయి తాగి వచ్చినట్లు అక్కడి వారంతా చర్చించుకోవడం కనిపించింది.
నాలుగు రోజుల క్రితం నాగర్ కర్నూలు జిల్లాలో కూడా గంజాయి వ్యవహరం వెలుగు చూసినట్లు వార్తలు వచ్చాయి. బిజినపల్లి మండలం వట్టెం గ్రామ సమీపంలోని కోళ్ల ఫారంలో గత కొద్దిరోజుల క్రితం కల్తీ కల్లు తయారీ కోసం వాడే మత్తు పదార్థాల తయారీ కేంద్రం గుట్టు బయట పడినప్పటికీ ఆ కేసులో సంబంధిత అధికారులు ఇప్పటివరకు నిందితులను గుర్తించలేకపోయారు. దీంతో గంజాయి సరఫరా కూడా ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లోనే నడుస్తోందనే అనుమానాలు బల పడుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అడ్డాకల్ గ్రామంలో గంజాయి సరఫరా చేస్తున్న ముఠా పట్టుబడడంతో ఈ ప్రాంతంలోనూ గంజాయి సరఫరా అంశం చర్చ జోరందుకుంది..