నాగార్జునసాగర్ లో నీటి కరువు.. డెడ్ స్టోరేజ్ కి చేరిన నాగార్జునసాగర్..
ఎగువ నుండి రాకపోవడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా మీరు లేక వెలవెలబోతున్న సాగర్ ప్రాజెక్ట్..
కృష్ణ నదిలో మాత్రం నీరు కరువైంది. ఆల్మట్టి, జూరాల నుంచి శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద నీరు వచ్చినప్పటికి.. అంతకు ముందు అది కూడా డెడ్ స్టోరేజ్‌లో ఉండటం వలన 10 రోజులకు పైగా వరద వచ్చి చేరినప్పటికి పూర్తిగా నిండలేదు. దీంతో నాగార్జున సాగర్‌కు నీటి విడుదల కాకపోవడంతో ప్రస్తుతానికి సాగర్ లో నీటి నిలువలు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. దీంతో సాగర్ ఆయకట్టుపై ఆదారపడిన కుడి, ఎడమ కాలువల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
సాగర్‌లో గరిష్టంగా 590 అడుగుల నిల్వ సామర్థ్యం ఉండగా.. ప్రస్తుతం 515.4 అడుగుల నీరు మాత్రమే ఉంది. అలాగే సాగర్‌కు నీరు ఇచ్చే శ్రీశైలంలో గరిష్టంగా 885 అడుగులు కాగా ప్రస్తుతం 864. 57 అడుగుల నీరు నిల్వ ఉంది. దీంతో శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయాలంటే కనీసం మరో 18 అడుగుల ఎత్తు నీరు అంటే 3 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరితే తప్ప సాధ్యం కాదు. దీంతో సాగర్ జలాశయానికి నీరు కావాలన్న.. ఆయకట్టు రైతులకు నీటిని వదలాలి అనుకున్న కానీ ప్రస్తుతం వదిలే పరిస్థితి కూడా ఆ ప్రాజెక్టు లేదు… బావులు కిందాపూర్లో కింద ఉన్న పొలాలు ప్రస్తుతం నాట్లు పూర్తవుతున్న.. పొట్ట దశలకి వచ్చేసరికి మీరు అందుతుందా లేదా అనే ఆలోచన కూడా రైతుల్లో మొదలైంది….
వర్షాల కోసం ఎదురు చూడటం తప్ప సాగర్ ఆయకట్టుకు నమ్ముకున్న రైతులకు మాత్రం ఈ పంటకి ఆశలు అడియాశలే అయినట్లేనని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…