కాపీరైట్ల ఉల్లంఘచి, ప్రపంచ నకిలీ ఉత్పత్తుల మార్కెట్ల జాబితా …

కాపీరైట్ల ఉల్లంఘన, నకిలీ ఉత్పత్తులకు పేరొందిన మార్కెట్ల జాబితాలో భారత్‌కు చెందిన బీటుబీ ఈ కామర్స్‌ పోర్టల్‌ ఇండియమార్ట్‌. కామ్‌ను యూఎస్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ తన తాజా జాబితాలోకి చేర్చింది. భారత్‌ నుంచి మరో నాలుగు మార్కెట్లు.. ముంబైలోని హీరా పన్నా, ఢిల్లీలోని ట్యాంక్‌ రోడ్, పాలికా బజార్, కోల్‌కతాలోని కిడ్డర్‌పోర్‌ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ‘ప్రపంచ నకిలీ మార్కెట్ల జాబితా 2021’ను యూఎస్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ (యూఎస్‌టీఆర్‌) గురువారం విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 42 ఆన్‌లైన్, 35 భౌతిక మార్కెట్లకు ఇందులో చోటు కల్పించింది…ఇవన్నీ పెద్ద ఎత్తున నకిలీ ట్రేడ్‌మార్క్‌లు, కాపీరైట్‌ హక్కుల ఉల్లంఘనకు వీలు కల్పిస్తున్నట్టు నివేదిక పేర్కొంది.నకిలీ, పైరేటెడ్‌ ఉత్పత్తులకు (కాపీరైట్‌ ఉన్న వాటికి నకిలీలు) సంబంధించి అంతర్జాతీయంగా నడుస్తున్న వాణిజ్యం అమెరికా ఆవిష్కరణలు, సృజనాత్మకతను దెబ్బతీస్తోంది. అమెరికా కార్మికులకు నష్టం కలిగిస్తోంది. ఈ చట్ట విరుద్ధమైన వ్యాపారం పెరగడం వల్ల నకిలీ ఉత్పత్తుల తయారీలో పాలు పంచుకునే కార్మికులను దోచుకునే విధానాలకు దారితీస్తుంది. నకిలీ ఉత్పత్తులు వినియోగదారులు, కార్మికుల ఆరోగ్యం, భద్రతకు పెద్ద ముప్పు’’ అని యూఎస్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ క్యాథరిన్‌ టే అన్నారు..