నకిలీ మద్యం తయారీ గుట్టు రట్టు….

నకిలీ మద్యం తయారీ గుట్టు రట్టు..

*- జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్*

*శ్రీకాకుళం/R9telugunews:-* స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది అంతరాష్ట్ర దాడుల్లో భాగంగా నకిలీ మద్యం తయారీ స్థావరాని గుట్టు రట్టు చేశారని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు.శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో నకిలీ మద్యం తయారీ విధానం,తయారికి ఉపయోగించే సామాగ్రి వివరాలను ఎస్పీ తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, సెబ్ స్టేషన్, సోంపేట వారి సిబ్బందితో  కలసి ముందుగా వచ్చిన సమాచారం మేరకు సోంపేట మండలం బురాగం గ్రామంలో మెకానిక్ షెడ్ వద్ద జాతీయ రహదారికీ 50 మీటర్లుదూరంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలొ ఒక బోలెరో పికప్ అటు వైపుగా వస్తుండటం గమనించి వాహనాన్ని సిబ్బంది సహాయం తో ఆపి తనిఖీ చేయగా అందులో కొన్ని కార్డ్ బోర్డు బాక్స్లు గమనించి తనికీ చేయగా అందులో లిక్కర్ బాటిల్లు కలవు. అనుమానం వచ్చి వాహనాన్ని మొత్తం తనిఖీ చేయగా 25 కార్డ్ బోర్డు బాక్స్ల నందు మొత్తం 1200 లిక్కర్ బాటిల్లు కలవు అవి ఒక్కక్కటి 180ఎం‌ఎల్ పరిమాణం కలిగి లిక్కర్ తో నింపి వున్నవి. వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించగా వారు ఒడిశా రాష్ట్రం బరంపుర్,కన్హేపుట (మొహాడ) గంజమ్ జిల్లా నందు స్పిరిట్ సహాయంతో రంగులు కలిపి రొయల్ స్టాగ్ మరియు, ఇంపెరియల్ బ్ల్యూ సీసాలలో నింపి వాటిని సోంపేట మండలం  పరిధిలో గల గ్రామాల్లో విక్రయించడం కొరకు రవాణా చేయుచుండగా పట్టుబడినము అని  తెలిపిరి. మరియు అచ్చటనే ఒక మోటార్ సైకల్ పైన సదరు వాహనము వెనుక వచ్చుచు సదరు వాహనములో వున్న వారికి ఎస్కార్ట్ గా వున్న ఇద్దరు ఆసామిలను అరెస్టు చేయడం జరిగింది.మోటార్ వాహనము సీజ్ చేయదమైయనదిన్నారు. తదుపరి సదరు పట్టుబడిన నలుగురు ఆసామిలను ప్రశ్నించగా వారు చెప్పిన సమాచారం మేరకు ఒడిశా రాష్ట్రం బరంపుర్, కన్హేపుట (మొహాడ) గంజమ్ జిల్లా కు వెళ్ళి ఒదిశ రాష్ట్ర పోలీసు వారి సహాయంతో సదరు ప్రదేశం నందు తనీఖి చేయగా అచ్చట 384 మధ్యం బోటేల్స్, స్పిర్ట్స్, నకిలీ మద్యం తయారీ యంత్రం, నకిలీ కప్పులు, నకిలీ లేబిల్, నకిలీ బార్ కోడ్ స్టికిర్స్, ఇన్వెట్రీ బ్యాటరీ, రంగునిల్లు, కాలి సీసాలు, మోటర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు అని అన్నారు.
మొత్తంగా సుమారు 285 లీటర్లు గల నకిలీ మద్యం గల 1574 క్వార్టర్ బాటిల్స్,15 లీటర్లు స్పీర్ట్ బోటెల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొత్తం కలిపి సుమారు రెండు లక్షల రూపాయలు విలువగల నకిలీ మద్యం పట్టుబడింది అని తెలిపారు. ఇలాంటి నకిలీ మద్యం సేవించడం వల్ల ఆరోగ్యానికి చాలా హానికరం అని ప్రజలు గుర్తించి తక్కువ ఖరీదు నకిలీ మద్యం సేవించి రాదని జిల్లా ఎస్పి ప్రజలను కోరారు. నకిలీ మద్యం తయారీ స్థావరాల యొక్క సమాచారం వివరాలను సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేసి నకిలీ మద్యం తయారీ రవాణా అరికట్టేందుకు పోలీసు శాఖకు సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
నకిలీ మద్యం పట్టుకొవడంలో ప్రతిభ కనబరిచిన సోంపేట ఎక్సిజ్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఎస్పి నగదు పోత్సకలు ఆదించి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ.కె. శ్రీనివాసరావు, అస్సిస్టెంట్ కమిషర్ కె.గోపాల్ సిబ్బంది పాల్గొన్నారు.