నక్సలైట్లు ప్లేట్‌ను ఒంట్లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌గా..!!

కాంకేర్-కోయిలిబెడ ప్రాంతంలోని కక్నార్ అడవుల్లో నక్సలైట్లతో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుండి పోలీసులు భారీ ఎత్తున వస్తువులను స్వాధీనం చేసుకున్నారు..రికవరీ చేసిన పదార్థాల్లో 3 బుల్లెట్ గుర్తులతో కూడిన ప్లేట్ కూడా లభ్యమైంది. ఈ ప్లేట్ గురించి పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. బుల్లెట్ల నుండి తమను తాము రక్షించుకోవడానికి నక్సలైట్లు ఈ ప్లేట్‌ను ఒంట్లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌గా ఉపయోగిస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు.

కక్నార్ అడవుల్లో ఎన్‌కౌంటర్ అనంతరం హతమైన నక్సలైట్ మృతదేహాన్ని పోలీస్ ప్రధాన కార్యాలయానికి తరలించారు. చనిపోయిన నక్సలైట్‌ను మావోయిస్ట్ దళ కమాండర్ మాంకర్‌గా గుర్తించారు. ఎన్‌కౌంటర్ ప్రదేశంలో జరిపిన సోదాల్లో అనేక వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు కంకేర్ ఎస్పీ ఐకె ఎలిసెలా తెలిపారు. వీటిలో ఇలాంటి వస్తువు కూడా దొరకడం చూసి ఆశ్చర్యపోయారు. సాధారణంగా సైనికులు బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు వాడుతుంటారు. కానీ ఇప్పుడు నక్సలైట్లు కూడా సైనికుల బుల్లెట్ల నుండి తమను తాము రక్షించుకోవడానికి స్వదేశీ బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లను ఉపయోగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.మందపాటి గుడ్డను మడతపెట్టి, దాని ముందు స్టీల్ ప్లేట్ పెట్టినట్లు పోలీసు సూపరింటెండెంట్ ఇందిరా కల్యాణ్ ఎలిసెల తెలిపారు. ఇందులో 3 బుల్లెట్ల గుర్తులు కనిపిస్తున్నాయి. దీన్ని చూస్తుంటే బుల్లెట్ల నుంచి రక్షించుకునేందుకు నక్సలైట్లు ఒంట్లోనే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాగా వాడుకుంటున్నారని తెలుస్తోందన్నారు ఎస్పీ.

శనివారం కక్నార్ అడవుల్లో నక్సలైట్లు సమావేశమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. డీఆర్‌జీ, బీఎస్‌ఎఫ్‌ల సంయుక్త బృందం కక్నార్ అడవులకు చేరుకుంది. ఈ సమయంలో నక్సలైట్లతో ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో సైనికులకు ఎలాంటి నష్టం జరగలేదు. కానీ సైనికుల బృందం జరిపిన కాల్పుల్లో యూనిఫాంలో ఉన్న మావోయిస్టును ప్రాణాలు కోల్పోయారు. హతమైన నక్సలైట్ దళం నంబర్ 5 కమాండర్ అని చెబుతున్నారు. తాడోకి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మలమెట గ్రామంలో నివాసం ఉండే మాంకర్‌ అనే వ్యక్తిగా గుర్తించారు. హతమైన నక్సలైట్‌పై గతంలో రూ.8 లక్షల రివార్డు ప్రకటించారు పోలీసులు.