న‌ల్ల‌మ‌ల అటవీ ప్రాంతంలో ఉరుములు, మెరుపుల‌తో భారీ వ‌ర్షం..

తెలంగాణలోని నాగర్​కర్నూల్​ జిల్లా న‌ల్ల‌మ‌ల అటవీ ప్రాంతంలో ఉరుములు, మెరుపుల‌తో భారీ వ‌ర్షం కురుస్తోంది. అమ్రాబాద్ ఏరియాలో ఇవ్వాల‌ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానతో అట‌వీ ప్రాంతం మొత్తం చిత్త‌డిగా మారింది. రోడ్ల‌న్నీ బుర‌ద బుర‌ద‌గా మార‌డంతో స‌లేశ్వ‌రం వెళ్లాల్సిన భ‌క్తులు ఇబ్బందిప‌డుతున్నారు. అందుక‌ని ఇప్పుడే స‌లేశ్వ‌రం రావొద్ద‌ని అధికారులు రిక్వెస్ట్ చేస్తున్నారు…