పోటీలో నిలబడ్డది జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి అయిన పోటీ మాత్రం ఉత్తంకుమార్ రెడ్డికి,,నాకే. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి… ఆసక్తికర వ్యాఖ్యలు …!

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో ఎంపీ పార్లమెంటరీ సమావేశం నిర్వహించగా ఆ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..

*సూర్యాపేట జిల్లా….*

మఠంపల్లి మండలంలో మట్టపల్లిలో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకుల ఎన్నికల సన్నాహక సమావేశం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు…. మొదటగా – మట్టపల్లి మహా క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం దర్శనం
అనంతరం – నల్గొండ పార్లమెంట్ నియోజక వర్గ కాంగ్రెస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దీపా దాస్ మున్షి AICC ఇంఛార్జి , R&B శాఖ మంత్రి వర్యులు కోమటి రెడ్డి వెంకట రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు, మాజీ CLP లీడర్ కుందూరు జానారెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, PCC కార్య నిర్వాహక అధ్యక్షుడు మహేష్ గౌడ్, బాలు నాయక్, MLA దేవరకొండ, బి లక్ష్మారెడ్డి MLA మిర్యాలగూడెం.., జైవీర్ రెడ్డి, MLA నాగార్జున సాగర్, పద్మావతి రెడ్డి MLA కోదాడ,. పాల్గొన్నారు.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ .. పోటీలో నిలబడ్డది జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి అయిన పోటీ మాత్రం ఉత్తంకుమార్ రెడ్డికి,, నాకే…… ఆయన నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీ వస్తుందా లేదా నా నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీ వస్తుందా…. అని మా ఇద్దరి మధ్యలో పోటీ జరగబోతుందని అన్నారు… లేదా జానా రెడ్డి సొంత నియోజకవర్గ నాగార్జున్ సాగర్ లో ఎక్కువ మెజార్టీ వస్తుందా దాని గురించే మాట్లాడుకోవడం జరుగుతుందని అన్నారు.. దీంతో సభలో నవ్వుల వర్షం కురిసింది… తన గెలుపు కోసం ఏ విధంగా అయితే కార్యకర్తలు కృషి చేశారు ఇప్పుడు కూడా అదే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఎంపీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేయాలని అన్నారు.. కెసిఆర్ ఎప్పుడూ కూడా ఒకటో తారీకు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చిందే లేదని అన్నారు… ఒక్కో నెల 15వ తారీకు 20వ తారీకు జీతాలు పడేవని దీంతో ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందికి గురయ్యే వారు అని తెలిపారు….. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం స్వచ్ఛందమైన నీతి పాలన అందిస్తుందని అన్నారు…. అన్ని వర్గాల ప్రజలకు సరైన న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే దక్కుతుందని అన్నారు….