నల్గొండ మున్సిపల్‌ ఛైర్మన్‌ పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం..

*షురూ..!!!*
నల్గొండ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం నెగ్గింది.మున్సిపల్ ఛైర్మన్ సైదిరెడ్డికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబడిన సంగతి తెలిసిందే..
ఈ క్రమంలోనే మున్సిపల్ ఛైర్మన్ సైదిరెడ్డిపై అవిశ్వాస తీర్మానానికి 41 మంది అనుకూలంగా ఉండగా ఐదుగురు వ్యతిరేకంగా ఉన్నారని తెలుస్తోంది.జిల్లా కలెక్టర్ సమక్షంలో నిర్వహించిన ఓటింగ్ లో కాంగ్రెస్ కు అనుకూలంగా 41, బీఆర్ఎస్ కు అనుకూలంగా ఐదు ఓట్లు వచ్చాయి..

*నల్గొండ మున్సిపాల్టీలో కోమటిరెడ్డి మార్క్‌..!!*

*మున్సిపల్‌ ఛైర్మన్‌ పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం*

*బీఆర్‌ఎస్‌ ఛైర్మన్‌కు వ్యతిరేకంగా 41 ఓట్లు*

*బీఆర్‌ఎస్‌ ఛైర్మన్‌కు అనుకూలంగా ఐదు ఓట్లు*

*ఛైర్మన్‌కు వ్యతిరేకంగా ఓటు వేసిన బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు*

*నల్గొండ మున్సిపాల్టీలో మొత్తం 48 మంది కౌన్సిలర్లు*

ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరపు గెలిచిన 20 మంది

కాంగ్రెస్‌ తరపు 20 మంది, బీజేపీ తరపు 6..

ఎంఐఎం నుంచి ఒక కౌన్సిలర్‌ గెలుపు

కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ మృతితో జరిగిన ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం

మరో కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ బీఆర్‌ఎస్‌లో చేరడంతో 22కి చేరిన బీఆర్‌ఎస్‌ బలం

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన 9 మంది కౌన్సిలర్లు

ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో చేరిన మరో ఆరుగురు కౌన్సిలర్లు

బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల చేరికతో 34కు చేరిన కాంగ్రెస్‌ బలం

34 మందితో ఛైర్మన్‌పై అవిశ్వాసం పెట్టిన కాంగ్రెస్‌

అవిశ్వాసం సమయంలో కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన మరికొంతమంది కౌన్సిలర్లు

*అవిశ్వాసం నెగ్గడంతో పదవి కోల్పోయిన మందడి సైదిరెడ్డి*

*కాంగ్రెస్‌ కౌన్సిలర్లలో ఒకరిని ఛైర్మన్‌గా ఎన్నుకునే అవకాశం…

నల్గొండ మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది.