నల్లమద్ది చెట్టు నుంచి వస్తున్న నీరు..

వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
ఈ క్రమంలోనే తరచూ అనేక వింత ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట జరిగే వింత ఘటనలు, చిత్రవిచిత్రాలు మనకు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. సాధారణంగా ఎక్కడైన భూమిలో నుంచి నీరు ఉబికి వస్తాయి. కానీ ఒక చెట్టు నుంచి నీరు ఉబికి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయితే ఒక చెట్టును మొదలు నరుకుతుండగా నీరు ఉబికి వచ్చింది. ఈ వింత ఘటన అల్లూరి జిల్లా జిల్లాలో చోటు చేసుకుంది….

వీడియో చూడాలంటే ఈ కింద లింక్ క్లిక్ చేయండి.
https://youtube.com/shorts/U3Gv-61CWM8?si=ip1-aGD3bKh-mH66

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లా దేవిపట్నం, రంపచోడవరం అటవీ ప్రాంతంలో అద్భుతం జరిగింది.

బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులు చెట్ల నుంచి నీరు రావడం చూసి ఆశ్చర్యపోయారు. నల్లమద్ది చెట్టు నుంచి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని అధికారులు తెలిపారు.

దీనికి సంబంధించిన వీడియోను అధికారులు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరలయింది…