నల్లమల అడవుల్లో అదుపులోకి మంటలు..

నల్లమల అడవుల్లో అదుపులోకి మంటలు…

నాగర్‌ కర్నూల్‌ జిల్లా నల్లమల అడవుల్లో రాత్రి చెలరేగిన మంటల్ని అటవీశాఖ సిబ్బంది ఎట్టకేలకు అదుపులోకి తెచ్చారు. హైదరాబాద్‌-శ్రీశైలం ప్రధాన రహదారికి అనుకుని ఆక్టోపస్‌ వ్యూ పాయింట్‌ నుంచి నీలారం బండల వరకు రాత్రి 10గంటల సమయంలో మంటలు అంటుకున్నాయి.దాదాపు 12 హెక్టార్ల మేర మంటలు విస్తరించాయి. సమాచారం తెలుసుకున్న అటవీ, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. విస్తీర్ణం అధికంగా ఉండటంతో మంటల్ని అదుపులోకి తేవడం సిబ్బందికి కష్టంగా మారింది. ఎట్టకేలకు తెల్లవారుజాము సమయంలో మంటల్ని పూర్తిగా ఆర్పివేసినట్టు దోమలపెంట రేంజ్‌ అధికారి రవిమోహన్‌ భట్‌ తెలిపారు.