నల్లమల్ల అడవిలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం..!

నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల్ల అడవిలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మల్లెలతీర్థం తాటిగుండాలలో అడవి తగలబడుతోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది ఫైరింజన్ల సహయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలను ఆర్పే క్రమంలో ఓ ఫైర్ వాచర్‌కు గాయాలు అయ్యాయి. వెంటనే అధికారులు ఆసుపత్రికి తరలించారు. నల్లమల అడవిలో మంటలు ఎగసిపడుతుండటంతో సమీప ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు. అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణం ఏంటి అన్నది తెలియాల్సి ఉంది…