నారా లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు సిఐడి అధికారులు ఢిల్లీ బయలుదేరారు.
అమరావతి – ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ వ్యవహారంలో 14వ నిందితుడిగా ఉన్నటిడిపి నాయకుడు లోకేష్…!
▪️అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ 14 గా ఉన్న నారా లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు సిఐడి అధికారులు ఢిల్లీ బయలుదేరారు.
▪️విచారణకు రావాల్సిందిగా 41 ఏ కింద నోటీసులు ఇవ్వనున్నారు..
▪️మరోవైపు ఇదే కేసులో లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు డిస్పోస్ చేసింది.
▪️విచారణకు సహకరించాలని సూచించింది దీంతో స్వయంగా నోటీసులు ఇచ్చేందుకు సిఐడి బృందం ఢిల్లీకి వెళ్లింది…
లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను డిస్పోజ్ చేసిన హైకోర్టు
ఇది ఇలా ఉంటే ఎపి హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ నేడు వాదనలు కొనసాగాయి.. ప్రభుత్వ తరుపున ఎజి తన వాదనలు వినిపిస్తూ, నారా లోకేష్ ను విచారించేందుకు వీలుగా 41 ఎ నోటీస్ జారీ చేస్తామని హైకోర్టు దృష్టికి తెచ్చారు.. దీంతో లోకేష్ అరెస్ట్ అవకాశాలు లేకపోవడంతో నారా లోకేష్ పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది..