నార్సింగ్ డ్రగ్స్ కేసు లో నటి లావణ్య ఫోన్ లో కీలక డేటా..?.

నార్సింగిలో డ్రగ్స్ కేసులో నిన్న పట్టుబడిన నటి లావణ్య పరిచయాలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు.

పలు షార్ట్ ఫిలిమ్స్ లో హీరోయిన్ గా పనిచేస్తూ ఓ టాలీవుడ్ హీరో ప్రియురాలిగా ఆమె మారినట్లు పోలీసులు గుర్తించారు.

ఆమె ఫోన్, సోషల్ మీడియా, వ్యక్తిగత చాటు పరిశీలించారు. మొబైల్ లో పలువురు సింగర్స్, సినీ ప్రముఖుల కాంటాక్ట్స్ ను గుర్తించారు.

దీంతో లావణ్యను 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును ఈరోజు కోరారు….