డ్రగ్స్ వ్యవహారంలో , ఫడణవీస్‌..నవాబ్ మాలిక్.. ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు…

రియాన్ భాటి ఎవరు? అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధం ఉన్న భాటి.. నకిలీ పాస్‌పోర్టుతో పోలీసులకు చిక్కాడు. కానీ రెండు రోజుల్లోనే అతడిని వదిలేశారు.
బయటపెట్టారు.బాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో మహారాష్ట్ర నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సవాళ్లు విసురుకుంటున్నారు…

ఫడణవీస్, భాజపా పెద్దలు హాజరయ్యే వేడుకల్లో అతడు పలుమార్లు కనిపించాడు…
ముంబయి క్రూజ్ నౌక డ్రగ్స్ కేసు మహారాష్ట్ర అధికార, విపక్ష పార్టీల మధ్య ఘాటు విమర్శలకు దారితీస్తోంది. ఒకరు దీపావళి బాంబు అని, మరొకరు హైడ్రోజన్ బాంబు అని.. సంచలన విషయాలు బయటపెడుతున్నారు. నిన్న మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్..మంత్రి నవాబ్‌ మాలిక్‌కు అండర్ వరల్డ్‌తో సంబంధాలున్నాయని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో ఫడణవీస్ గురించి మాలిక్ పలు విషయాలు ఈ క్రమంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌పై ఆ రాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు అండర్‌ వరల్డ్‌తో సంబంధాలున్నాయని వేలెత్తి చూపే ధైర్యం ఎవరికీ లేదని మంగళవారం మీడియాతో వ్యాఖ్యలు చేశారు. Nawab Malik వాంఖడే వేసుకున్న చొక్కా ఖరీదు రూ.70 వేలు మాలిక్‌బాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో మహారాష్ట్ర నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సవాళ్లు విసురుకుంటున్నారు.. దానిలో భాగంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు…

మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపణలు..

1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన అండర్ వరల్డ్ వ్యక్తులతో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌కు సంబంధాలు ఉన్నాయని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు. మంగళవారం అతను దోషుల నుండి భూమిని మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేశాడు. టాడా చట్టం ప్రకారం ప్రధాన భూమిని జప్తు చేయకుండా కాపాడేందుకే ఈ ఒప్పందమా?” అని ఫడ్నవీస్ ప్రశ్నించారు. మహారాష్ట్రలో అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారానికి ఫడ్నవీస్ సూత్రధారి అని నవాబ్ మాలిక్ గత వారం ఆరోపించిన సంగతి తెలిసిందే. డ్రగ్ డీలర్ జయదీప్ రాణాతో ఫడ్నవీస్ మరియు అతని భార్య అమృత ఫడ్నవీస్ ఉన్న ఫోటోలను కూడా అతను విడుదల చేసాడు.