ఎన్నికల వేళ NDA కూటమిలో చేరనున్న మరో ప్రాంతీయ పార్టీ..?.

*🔹ఎన్నికల వేళ NDA కూటమిలో చేరనున్న మరో ప్రాంతీయ పార్టీ..?*

మహారాష్ట్రలోని MNS(మహారాష్ట్ర నవ నిర్మాణ సేన) పార్టీ NDA కూటమిలో చేరనున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు MNS చీఫ్ రాజ్ థాక్రేకి, BJP సీనియర్
లీడర్లకు మధ్య చర్చలు జరుగుతున్నాయి.

ఇప్పటికే రాజ్ థాక్రే తన కుమారుడు అమిత్ థాక్రేతో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్అను కలిసినట్లు వార్తలు
వస్తున్నాయి.

శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేకు బంధువే ఈ రాజ్ థాక్రే.

ఆయన శివసేనను వీడి 2006లో MNSను స్థాపించారు.

దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బెంగళూరులో 26 విపక్ష పార్టీలు సమావేశం కాగా.. అటు ఢిల్లీలో ఎన్డీయే కూటమి కూడా 38 పార్టీలతో తన బలాన్ని నిరూపించుకునే పనిలో నిమగ్నమైంది. ఈ రోజు ఢిల్లీలోని అశోక హోటల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ఎన్డీయే కూటమి భేటీ జరిగింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్డీయే బల నిరూపణగా భావించే సమావేశంలో కూడ పలు మార్లు ఆహ్వానించినట్లు సమాచారం..