నీట్ లీకేజీపై స్పందించిన ప్రధాని మోదీ..
ప్రశ్నాపత్రం లీక్ కావడం సాధారణ విషయం కాదు.. లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎంతో బాధాకరమైన విషయం..
విద్యార్థుల ఒక సంవత్సరం వృథా కాకూడదని తమ పూర్తి శక్తిని ఉపయోగించి, 22 లక్షల మందికి పరీక్షలు నిర్వహించాం..
పేపర్ లీకేజీ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు అనేక గట్టి చర్యలు తీసుకున్నాం, దోషులను పట్టుకుని జైలులో పెట్టాం..
ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు, కఠినమైన శిక్షా విధానాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాం..
దీనిపై కేబినెట్లో చర్చించి, ఇతరుల సూచనల తర్వాత ఈ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో వీలైనంత త్వరగా ప్రవేశపెడతాం అని ప్రధాని మోదీ అన్నారు..
నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై ప్రధానమంత్రి మోదీ స్పందించాల్సి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. తమకు యువత సంక్షేమం, భవిష్యత్తే ముఖ్యమని వెల్లడించారు. వారి శ్రేయస్సు,భవిష్యత్ కంటే ఏదీ ముఖ్యం కాదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై ప్రధాని మోదీ గురువారం అర్ధరాత్రి ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. ‘ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించా. శుక్రవారం కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నాం. పేపర్ లీకేజ్ ఘటనపై గత రెండున్నర నెలల్లో అనేక సమర్థవంతమైన చర్యలు తీసుకున్నాం. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుచేయాలని సంబంధిత శాఖలను ఆదేశించా’ అని చెప్పారు. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితులను పట్టుకున్నామని, విద్యార్థుల విద్యా సంవత్సరం వృధా కాకుండా చూడాలన్న ప్రభుత్వ బాధ్యతను తాము నెరవేర్చామని చెప్పారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు.
దీనికంటే ముందు పరీక్ష లీకేజీ కేసుల్లో సకాలంలో విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తుందని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా గురువారం ప్రకటించారు. ప్రధాని ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తున్నట్టు ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది. పబ్లిక్ పరీక్షల చట్టం (అక్రమ పద్ధతుల నివారణ) పరిధిలోకి వచ్చే నేరాలు, సంబం ధిత కేసులను ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారిస్తుందని పేర్కొంది.