_అంత్యక్రియలు పూర్తయిన కొడుకు తిరిగొచ్చాడు…!!!!?

*నెల్లూరు జిల్లా.
_అంత్యక్రియలు పూర్తయిన కొడుకు తిరిగొచ్చాడు…?..

బైక్‌పై వెళ్లిన కొడుకు ఇంటికి రాలేదు. అంతేకాదు రోడ్డు పక్కన ఉన్న చెరువు సమీపంలో బైక్ నిలిపివేసి అదృశ్యం అయ్యాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే చెరువు సమీపంలో బైక్ లభించడంతో అనుమానం వచ్చి చెరువులో వెతకగా గుర్తు తెలియని మృతదేహం లభించింది…

శవనీ పూడ్చి కార్యక్రమలు అని పూర్తయిన తర్వాత శవం లేచొచ్చింది…

_పూడ్చిపెట్టిన శవం మనిషి రూపంలో కళ్లముందు కనపడే సరికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భయపడిపోయారు, ఊరివారంతా హడలిపోయి పరుగులెత్తారు._

_దింపుడు కళ్లెం ఆశతో శవానికి దహన సంస్కారాలు చేసేముందు, మూడుసార్లు పేరు పెట్టి పిలవడం హిందూ సంప్రదాయం. చనిపోయినవారు బతికొస్తారని కాదు కానీ, అది ఆచారంగా భావిస్తుంటారు._

_అయితే అలాంటి ఆచారం కాస్తా ఇప్పుడు నెల్లూరులో నిజమైంది._

_ఇదేదో కల్పిత కథ కాదు, సీరియల్ లో, సినిమాల్లో జరిగింది అంతకంటే కాదు, నిజ జీవితంలో జరిగిన వాస్తవం._

_నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వడ్లమూడిలో జరిగిన యదార్థ ఘటన._

_మనుబోలు మండలం వడ్లపూడి గ్రామంలో పాలేటి వెంకయ్య, రమాదేవి దంపతులు._

_రమాదేవి గ్రామ సర్పంచ్, వారికి ఇద్దరు పిల్లలు, పెద్ద కొడుకు పేరు సుమంత్, రెండో కొడుకు పేరు సతీష్._

_ఇటీవల రెండో కొడుకు సతీష్ కుటుంబ సభ్యులపై అలిగి ఇంట్లోనుంచి వెళ్లిపోయాడు. అతనికోసం కుటుంబ సభ్యులు గాలించారు._

_తెలిసినవారికి ఫోన్ చేశారు, స్నేహితుల్ని ఆరా తీశారు, కానీ ఫలితం లేదు, మూడు రోజులుగా జాడ తెలియలేదు._

_అయితే వీరు వెదికే క్రమంలో వెంకటాచలం మండలం కనుపూరు చెరువులో ఓ శవం కనిపించింది. ఆ శవం పోలికలు సతీష్ లానే ఉన్నాయి._

_దీంతో కుటుంబ సభ్యులు శవాన్ని తీసుకొచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు. అంతా అయిపోయాక చిన్న కర్మ కూడా నిర్వహించారు. సతీష్ ఫొటోకి దండవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు._

*_సీన్ కట్ చేస్తే…_*

_శనివారం అంత్యక్రియలు పూర్తయ్యాయి, ఆదివారం సతీష్ ఇంటికి తిరిగొచ్చాడు. పూడ్చేసిన శవం ఎలా లేచొచ్చిందంటూ తల్లిదండ్రులు కంగారు పడ్డారు._

_ఊరిలో సతీష్ ని చూసినవారంతా దెయ్యం అంటూ పారిపోవడం విశేషం. కుటుంబ సభ్యులు కూడా సతీష్ ని చూసి దెయ్యం అనుకున్నారు, పరుగులు తీశారు, ఆ తర్వాత అసలు విషయం బయటపడింది._

*_సతీష్ ఎలా తిరిగొచ్చాడు…?_*

_అసలిన్ని రోజులు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడనే విషయం తానే స్వయంగా చెప్పుకొచ్చాడు._

_అలిగి వెళ్లిన తాను స్నేహితుల దగ్గర ఉన్నానని చెప్పాడు సతీష్. ఫోన్ కూడా స్విచాఫ్ చేసి నాలుగు రోజులుగా రూమ్ లోనే ఉండిపోయాయని అన్నాడు. తీరా ఊరిలోకి వస్తే అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయని తెలుసుకుని పరుగు పరుగున ఇంటికొచ్చానని చెప్పాడు._

_సతీష్ ని చూసి మొదట భయపడిన కుటుంబ సభ్యులు ఆ తర్వాత ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు._

_చనిపోయాడనుకున్న కొడుకు బతికి రావడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అంతేకాదు ఆ మృతదేహాన్ని తీసుకొచ్చి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంతలో కుమారుడు సతీశ్ ఆదివారం మధ్యాహ్నాం ఇంటికి వచ్చాడు.సతీశ్‌ను చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. గ్రామస్థులు కూడా ఆశ్చర్యంగా సతీశ్ వైపు చూశారు. అనంతరం చనిపోయాడని అనుకున్న తమ కుమారుడు తిరిగి రావడంతో తల్లిదండ్రులు పరవశించిపోయారు. అయితే ఏమైపోయావని నిలదీయగా బైక్ ‌పై కావలి వెళ్తుండగా పెట్రోలు అయిపోవడంతో బైక్‌ను అక్కడ రోడ్డు పక్కన పెట్టానని సతీశ్ తల్లిదండ్రులకు తెలిపాడు. తనకు తెలిసిన వారి దగ్గర రెండు రోజులు ఉండి బస్సులో ఇంటికి వచ్చానని చెప్పుకొచ్చాడు.
*_ఆ మృతదేహం ఎవరిది ??_*

_అయితే సతీష్ గా పొరబడి అంత్యక్రియలు చేసిన మృతదేహం ఎవరిదనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది._

_సతీష్ మృతదేహం అనుకుని తల్లిదండ్రులు, శవాన్ని పూడ్చేశారు…

_దీనిపై పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు, పోలీసులు ఆ శవాన్ని వెలికితీసి.. ఎవ్వరిది ఆని విచారణలో పడ్డారు.దీంతో అసలు చిక్కు మెుదలైంది….!!_