అరుదైన నల్ల మూపు నెమలిపావురం!.

పోర్ట్‌ మోర్సీ, నవంబర్‌ 18: 140 ఏండ్ల కిందట కనిపించకుండా పోయిన నల్లమూపు నెమలి పావురాన్ని పరిశోధకులు తిరిగి కనుగొన్నారు. ఈ అరుదైన పక్షి వీడియో ఫుటేజీని పపువా న్యూగినియాలోని అటవీ ప్రాంతంలో చిత్రీకరించారు. ఈ నెమలి పావురాన్ని చిత్రీకరించేందుకు పరిశోధకులు నెలలపాటు శ్రమించారు. స్థానికుల నుంచి సమాచారం సేకరించారు…అటవీ ప్రాంతంలో కెమెరా ట్రాప్స్‌ ఏర్పాటు చేశారు. చివరికి సెప్టెంబర్‌లో ఇది కెమెరాకు చిక్కింది. ఈ పక్షి పపువా న్యూగినియాలోని ఫెర్గూసన్‌ ద్వీపానికి చెందినది. బర్డ్‌లైఫ్‌ ఇంటర్నేషనల్‌, రివైల్డ్‌, అమెరికన్‌ బర్డ్‌ కన్జర్వెన్సీ సహకారంతో పరిశోధనా బృందం కనుమరుగైన పక్షుల జాతులను గుర్తిస్తున్నాయి. ఈ బృందం 2019లోనే నల్లమూపు నెమలిపావురాన్ని కనుగొనేందుకు ప్రయత్నించింది. కానీ, విఫలమైంది.