నేపాల్‌లో భారీ భూకంపం…

ఆదివారం ఉదయం నేపాల్‌లో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది.నేషనల్ ఎర్త్‌క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (NEMRC) ప్రకారం, నేపాల్‌లోని ఖాట్మండుకు 147 కి.మీ ESE దూరంలో ఖోటాంగ్ జిల్లా మార్టిమ్ బిర్టా చుట్టూ ఉదయం 8.13 నిమిషాలకి భూకంపం సంభవించింది…

భూకంప కేంద్రం తూర్పు నేపాల్ లో ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. 27.14 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 86.67 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉన్నట్టుగా అధికారులు తెలిపారు. భూ0కంపం వచ్చిన ప్రాంతం ఇండియాలోని బీహార్ రాష్ట్రానికి సమీపంలో ఉంది. భీహార్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్టుగా సమాచారం.
ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్టుగా సమాచారం అందలేదని అధికారులు ప్రకటించారు.ఇటీవల కాలంలో జరిగిన భూకంపాలు ప్రాణ, ఆస్తి నష్టాన్ని కల్గించాయి. భూకంపాలు వచ్చిన సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు…