నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో వేలాది మంది యువత రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనల్లో తొమ్మిది మంది మృతిచెందారు. మరో 42 మందికి తీవ్రగాయాలయ్యాయి..పార్లమెంట్ వద్ద కర్ఫ్యూ ప్రకటించారు. కాఠ్మాండూలో భారీ నిరసనలతో సైన్యం పెద్ద ఎత్తున మోహరించింది…

నేపాల్ లో అధికారంలో ఉన్న కేపీ శర్మ ఓలీ ప్రభుత్వంలో అవినీతి, బంధుప్రీతి పెరిగిపోవడం, ఉపాధి లేకపోవడం వంటి కారణాలతో యువతలో నైరాశ్యం నెలకొంది. అదే సమయంలో వీటిపై సోషల్ మీడియాలో చర్చ జరగకుండా ప్రభుత్వం ఏకంగా
26 యాప్స్ ను నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయం మొత్తం వివాదానికి ఆజ్యం పోసినట్లయింది. దీంతో యువత రోడ్లపైకి వచ్చారు. జెన్ జడ్ విప్లవం పేరుతో బ్యానర్లు పట్టుకుని రూడ్లపై నిరసన ర్యాలీలు చేపట్టారు…సోషల్ యాప్స్ పై నిషేధాన్ని ప్రభుత్వం నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ప్రకటించినప్పటికీ.. నిరసనకారులు మాత్రం దీనిని విమర్శనాత్మక స్వరాలను , వ్యవస్థీకృత భిన్నాభిప్రాయాలను అణచివేయడానికి ఉద్దేశించిన ప్రత్యక్ష సెన్సార్షిప్ చర్యగా అభివర్ణిస్తూ ఆందోళనలకు దిగారు. ప్రభుత్వం ఫోన్ , ఇంటర్నెట్ లను నిషేధించడంతో జెన్ జీ యువకులు టిక్టాక్ , రెడ్డిట్ వంటి ప్రత్యామ్నాయ వేదికల వైపు మళ్లారు. వేలాది మంది యువ ప్రదర్శనకారులు గుమిగూడి, ప్రభుత్వానికి, దాని విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ మార్చ్ మైతిఘర్ మండల వద్ద ప్రారంభమై పార్లమెంట్ భవనం వైపు సాగింది..దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి నిరసనకారుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా యువత మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో పోలీసులు వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగాలు కూడా చేశారు. దీంతో రెచ్చిపోయిన నిరసనకారులు పోలీసులపై వాటర్ బాటిల్స్ విసిరారు. ఈ దాడులు, ప్రతిదాడుల్లో ఆరుగురు నిరసనకారులు చనిపోయారు. మరో 40 మందికి పైగా గాయపడ్డారు. ప్రభుత్వం మాత్రం సోషల్ మీడియా బ్యాన్ ను సమర్ధించుకుంది…
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Welcome to R9 Telugu News : Get Latest and Breaking News in Telugu, Top News Headlines from Hyderabad and Telangana at our flagship website r9telugunews.com Read Latest Telugu Daily News, Andhrapradesh, Telangana, India, World, Business, Sports, Entertainment News updtes...