నేరేడు పండ్లు తింటే షుగర్ దూరం: నిపుణులు
ప్రతి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నేరేడు పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. నేరేడు పండ్లను తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్ సి వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. అయితే నేరేడు పండ్లను అధికంగా తినడం వల్ల జ్వరం, గొంతు సమస్యలు వస్తాయి. శ్వాస సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు….
నేరేడు పండ్లు ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇది మన శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతుంది. దీనివల్ల జ్వరం, దగ్గు ,జలుబు వంటి వాటినుండి బయటపడవచ్చు . నేరేడు పండ్లలో పొటాషియం లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరంలోని హై బిపి, హైపర్ టెన్షన్ వంటి సమస్యలను అదుపు చేయవచ్చు.
నేరేడు పండు తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా అరికట్టవచ్చు.
నేరేడు పండు డిమెన్షియా, ఆమ్నీషియా వంటి ఆరోగ్య సమస్యల నుండి మనల్ని కాపాడుతుంది. యూరినరీ సమస్యలు ఉన్నవాళ్లు కూడా నేరేడు పండ్లు తినడం వల్ల ఆ సమస్యలను నయం చేసుకోవచ్చు.కొందరు గర్భిణీ స్త్రీలు నేరేడు పండ్లను తినకూడదు అని పెద్ద వారు చెబుతుంటారు అయితే గర్భిణీ స్త్రీలు నేరేడు పండు తినడం వల్ల బిడ్డ ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుంది కనుక నిరభ్యంతరంగా గర్భిణీ స్త్రీలు నేరేడు పండ్లు తినవచ్చు. ఇలా నేరేడు పండ్లను తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం పెట్టవచ్చని నిపుణులు చెపుతున్నారు..
జామున్ సీడ్ పౌడర్ వల్ల కలిగే ప్రయోజనాలు..
ఈ సీజన్లో జామూన్ను ఎక్కువగా తిని దాని గింజలను కడిగి ఉంచుకోవాలి. ఈ గింజలను ఎండలో ఆరబెట్టి పొడి చేసుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ పొడి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేరేడు గింజలలో జంబోలిన్, జంబోసిన్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి చక్కెర విడుదలను నెమ్మదించేలా చేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు భోజనానికి ముందు ఈ పొడిని తీసుకోవాలి…