అవిశ్వాస తీర్మానం సంబురాల్లో అపశృతి…!

నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం సంబురాల్లో అపశృతి జరిగింది… అవిశ్వాస తీర్మానంలో నెగ్గామని విజయోత్సవం సందర్భంగా టపాసులు కాలుస్తున్న యువకులు,, అందులో రవి అనే యువకుడి చేతిలో బాంబు ఉండడం ఎదురుగా మరో వ్యక్తి బాంబులు కాలుస్తుండగా, ఆ నిప్పురవ్వలు చేతికి తగలడం , చేతిలో ఉన్న బాంబు పేరడంతో చేతి వేళ్లన్నీ కూడా నుజ్జు నుజ్జు అయిపోయాయి.. వెంటనే ఆ యువకుడిని బైక్ పై హాస్పిటల్ కి తరలించడం జరిగింది.. ఈ విషాద సంఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో జరిగింది. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం.. మంగళవారం ఉదయం నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్‌పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ అవిశ్వాసానికి మున్సిపల్ చైర్మన్ గైర్హాజరు అయ్యారు. అయినా చైర్మన్‌ను తొలిగించే అంశంలో కాంగ్రెస్ కౌన్సిలర్స్ విజయం సాధించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు టపాసులు కాల్చారు..