నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్‌పై నెగ్గిన అవిశ్వాసం..మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా..!

*సూర్యాపేట జిల్లా…*

నేరేడుచర్ల పాలిటీ పరిధిలో కౌన్సిలర్లు మొత్తం 15……

అవిశ్వాసంలో బీఆర్ఎస్ పార్టీకి కూడా కౌన్సిలర్లు మద్దతు…

మున్సిపల్ చైర్మన్ జయ బాబు పై అవిశ్వాసం కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఫోర్ లీడర్ కొనతం చిన్న వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పదిమంది కౌన్సిలర్లు డిసెంబర్ 13న జిల్లా కలెక్టర్ వెంకట్రావుతో పాటు ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డికి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లకు కలిసి వినతి పత్రం అందించారు. మొదట దీనికి జనవరి 11న అవిశ్వాసానికి సమావేశం ఏర్పాటు చేస్తూ ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేశారు. కానీ కొన్ని కారణాలవల్ల ఆ సమావేశాన్ని రద్దు చేస్తూ ఈనెల 23న నిర్వహించాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంతో మంగళవారం 11 గంటలకు నేరేడుచర్ల మున్సిపాలిటీలో హుజూర్ నగర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి అధ్యక్షత అవిశ్వాసం సంబంధించిన సమావేశం జరగనుంది. ఈ అవిశ్వాసానికి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ కూడా మద్దతు తెలపడం గమనార్హం. అయితే మున్సిపల్ చైర్మన్ జయ బాబుపై కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసానికి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ అంతా మద్దతు తెలపడంతో చైర్మన్ మాత్రమే ఒంటరిగా మిలిగిపోయాడు..

డిసెంబర్ 6నా అవిశ్వాస తీర్మానాన్ని కలెక్టర్ కి అందజేయడం జరిగింది….

నేడు 23 తేదీన తీర్మానాన్ని నేరేడుచర్ల మున్సిపాలిటీలో ప్రవేశపెట్టడం జరిగింది..

BRS పార్టీ కౌన్స్ లర్ లు..6.

కాంగ్రెస్ పార్టీ కౌన్స్ లర్ లు..7..

సీపీఎం….1..

రాజీనామ.. brs (1).

(గతంలో చల్లా శ్రీలత రెడ్డి బిఆర్ఎస్ పార్టీకి వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం.. అనంతరం బిజెపి పార్టీలో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది.).

నేడు హుజూర్ నగర్
Rdo జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది..

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో. BRS పార్టీ నుండి ఇద్దరు కాంగ్రెస్ లో చేరడంతో పార్టీ కౌన్సిలర్ల సంఖ్య ..11కి చేరింది….

ప్రస్తుతం BRS పార్టీ కౌన్సిలర్లు..3 ఉన్నారు.

ఇందులో ఇద్దరు కూడా అసంతృప్తితో చైర్మన్ కి వ్యతిరేకంగా టూర్ కి వెళ్ళేరు…

దీంతో కాంగ్రెస్ పార్టీ బలం 13కి చేరింది…….

నేడు ఆర్డీవో జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది…….

ప్రస్తుతం దీనిపై నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఓటింగ్ నిర్వహించడంతో…
కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన
చైర్మన్ చందమల్ల జయ బాబు పై అవిశ్వాసం నెగ్గింది….

*అనంతరం ఆర్డిఓ జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ*

కలెక్టర్ పంపించిన ఆదేశాల మేరకు…

చందమల్ల జయ బాబు పై కలెక్టర్ కు ఫేమ్1 నోటీస్ కౌన్సిలర్లు ఇవ్వడంతో కలెక్టర్ ఫామ్ 2 నోటీసులు తమకు అందించడం జరిగిందని,, నేడు చందమల్ల జయ బాబు పై ఏర్పాటు చేసిన అవిశ్వాస తీర్మానం నెగడం ,, పూర్తిస్థాయిలో క్వారం అవిశ్వాసం తెలపడంతో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గిందని తెలిపారు…. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ కి తెలుపుతున్నట్లు తెలియజేశారు…..

16 మందిల సభ్యుల్లో ఇద్దరు ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఉన్నారు… వీరిలో ఇద్దరు ఎక్స్ అఫీషియల్ మరియు చైర్మన్ అవిశ్వాస తీర్మానానికి హాజరు కాలేదు.. మిగతా 13మంది కూడా హాజరు కావడం జరిగింది. వారు అవిశ్వాస తీర్మానం మద్దతు తెలపడం జరిగిందని తెలిపారు..

ప్రస్తుతం మున్సిపాలిటీలో సభ్యులుగా 16 మంది..

నేరేడుచర్ల మున్సిపాలిటీలో 15 వార్డుల గాను 13వ వార్డు కౌన్సిలర్‌గా వైస్ చైర్మన్ గా ఉన్న చల్లా శ్రీలత రెడ్డి తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయడంతో 14 మంది కౌన్సిలర్లు గానే ఉన్నారు. వీరితోపాటు ఎక్స్ ఆఫీసియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓటమి కావడం, అలాగే ఎమ్మెల్సీ బోడుకుంట్ల వెంకటేశ్వర్లు కూడా తన ఎమ్మెల్సీ సమయం పూర్తి కావడం. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న ఉత్తమ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం ‌ అలాగే రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు తన పదవి పూర్తి కావడంతో ఈ నలుగురికి ఈ మున్సిపాలిటీలో సభ్యత్వం కోల్పోయారు.
ప్రస్తుతం ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు బడుగులు లింగయ్యకు మాత్రమే ప్రస్తుతం సభ్యులుగా ఉండటంతో వారు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రస్తుతం 14 మంది కౌన్సిలర్లు 2 ఎక్స్ ఆఫీసియో సభ్యులతో కలిసి 16 మంది ఉండగా ఇందులో 2/3 మెజారిటీ అంటే 11 మంది సభ్యులు చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసానికి మద్దతు తెలిపితేనే అవిశ్వాసం నెగ్గుతుంది…