అన్నీ నేస్తం దగ్గరే…!!!

బంధాలన్నీ చుట్టూ ఉన్నా*
*మనసు విప్పేది నేస్తం దగ్గరే…..*

*తప్పులెన్ని చేసినా*
*ఒప్పుకునేది నేస్తం దగ్గరే*

*దాచుకున్న కోరికలన్నీ*
*తెలుపుకునేది నేస్తం దగ్గరే*

*కష్ట పెట్టు కలతలన్నీ*
*ఏకరువు పెట్టేది నేస్తం దగ్గరే*

*పొందిన ప్రతి చిన్న సంతోషాన్ని*
*పంచుకునేది నేస్తం దగ్గరే*

*ఎంతటి కష్టమొచ్చినా*
*ఓదార్పు దొరికేది నేస్తం దగ్గరే*

*చివరివరకు తోడుండేది*
*నిజమైన నేస్తం ఒకటే*

*అటువంటి అపురూప స్నేహం*
*అంత సులభంగా దొరకదు*

*నిజమైన స్నేహితులున్నవారు*
*నిక్కముగా అదృష్టవంతులు*

*మనమేలుకోరి మనవెంట వుండి*
*తప్పులు సరిదిద్దుతూ క్షమిస్తూ*
*మన చేయి వదలని నేస్తం*
*మనకో వరం….*

*అలాటి స్నేహితులు అందరికీ*
*ఉండాలని…. *దొరకాలని*