నేటి చిట్టికథ…

.నేటి చిట్టికథ

చోళ రాజ్యం లో కన్న మంగళం అనే గ్రామంలో తాయనార్ (అరివత్తయ్య నాయనార్ పూర్వనామం) అనే శివభక్తుడు ఉండేవాడు.

ఈయన ఎప్పుడు శివుడికి ఎర్ర బియ్యంతో అన్నం వండించి , ఎర్ర మూలికలతో చారు కాచి, మామిడి ఊరగాయ తో స్వామికి నివేదన పెట్టేవాడు.. ఈ నీవేదనకి స్వామి సంతుష్టుడు అయ్యాడు ఆయన భక్తి ఎంత గొప్పదో లోకానికి చూపాలి అని సంకల్పించాడు..

అప్పటి నుండీ తాయనార్ ఆస్థి తగ్గిపో సాగింది అయినా తాయనార్
స్వామికి ఎర్రబియ్యం ఎర్ర ములికల చారు ఆపలేదు..

ఈసారి స్వామి పరీక్ష లో తీవ్రత పెంచాడు తన ఆర్థికస్థితి దిగజారిపోయింది.. అయినా సరే తాయనార్ తగ్గలేదు స్వామికి ఎర్ర బియ్యం వండుతూ ఎర్ర ఆకులతో చారు కాచి తాను మాత్రం మంచినీళ్లు తాగి పడుకోసాగాడు..

ఇలా సాగుతూ ఉండగా ఒకనాడు నివేదనతో రహదారి పై నడుస్తుండగ కాళ్ళు తడబడి తాయనార్ కింద పడి నివేదన నేల పాలయ్యింది..

దాంతో ఖిన్నుడైనా తాయనార్ బిగ్గరగా ఏడుస్తూ నేనేం తప్పు చేశా స్వామి నాకెందుకీ శిక్ష అంటూ శోకిస్తూ పక్కనే ఉన్న కొడవలి అందుకుని తన కంఠం కత్తిరించుకోబోయాడు..

వెంటనే తాయనార్ చెయ్యి ఎవరో ఆపినట్టు కంఠానికి దగ్గర్లో ఆగింది కాని ఎవ్వరు కనపడలేదు కాని తన చెయ్యి మీద మరొక చెయ్యి ఉన్నట్టు స్పర్శ తెలుస్తోంది..

తాయనార్ కి అర్థం కాలేదు ఎవరు తన చెయ్యి పట్టి ఆపారో కాని పక్కనుండి ఎవరో ఆవకాయ ముక్క కొరికిన శబ్దం వినపడింది దాంతో తాయనార్ కి అర్థమైంది తన ప్రాణం కాపాడటానికి ఆ కైలాసనాథుడే వెండి కొండ వదిలి వచ్చాడని…

అంతే తాయనార్ ఆనందం పట్టలేక ఉత్సాహం తో స్వామిని స్తుతి చేస్తూ నృత్యం చేయసాగాడు..

ఆ స్తుతికి మెచ్చి శివుడు వృషభ వాహనుడై పార్వతి సమెతంగా ఆకాశం లో ప్రత్యేక్షమై నీవు నీ భార్య అనతి కాలంలోనే నా లోకం లొకి వచ్చేదరు అని ఆశీర్వదించి అంతర్ధనమయ్యారు…..