🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🪷పంచాంగం🪷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 13 – 10 – 2023,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – వర్ష ఋతువు,
భాద్రపద మాసం – బహళ పక్షం,
తిథి : చతుర్దశి రా9.01 వరకు,
నక్షత్రం : ఉత్తర మ2.36 వరకు,
యోగం : బ్రహ్మం ఉ11.33 వరకు
కరణం : భద్ర ఉ8.07 వరకు
తదుపరి శకుని రా9.01వరకు,
వర్జ్యం : రా11.43 – 1.27,
దుర్ముహూర్తము : ఉ8.15 – 9.02 &
మ12.09 – 12.56,
అమృతకాలం : ఉ6.40 – 8.26,
రాహుకాలం : ఉ10.30 – 12.00,
యమగండo : మ3.00 – 4.30,
సూర్యరాశి : కన్య,
చంద్రరాశి : కన్య,
సూర్యోదయం : 5.55,
సూర్యాస్తమయం: 5.38,
*_నేటి మాట_*
*భగవంతునికి ప్రీతి పాత్రులు ఎవరు??*
ఎవరి వాక్కు సత్యంతో కూడి ఉంటుందో, ఎవరి హృదయం ప్రేమతో నిండి ఉంటుందో, ఎవరు మనస్సు నిరంతరం భగవచ్చింతనలో లీనమై ఉంటుందో, ఎవరి కర్మలు స్వార్థరహితమై పరోపకార నిమిత్తం జరుపబడుచున్నవో అట్టివారు భగవంతునికి అత్యంత ప్రియమైనవారు…
ఇట్టి వారిని కలి ఏమీ చేయజాలదు, ఇట్టివారున్న చోట కలి ప్రవేశం నిషిద్దం, కృూర మృగములు సహితం వీరి చెంత శాంతియుతంగా జీవించగలవు…
నాస్తికత, హింస, కృూరత్వం, ఇత్యాది దుశ్చర్యలతో నిండిపోయిన నేటి ప్రపంచం ఇంకా సురక్షితంగా ఉందంటే కారణం వీరే!…
*_🪷శుభమస్తు🪷_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏