నేటి పంచాంగం…

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి బ.ద్వాదశి ప.3.20 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం శ్రవణం రా.9.43 వరకు, తదుపరి ధనిష్ఠ వర్జ్యం రా.1.45 నుండి 3.22 వరకు, దుర్ముహూర్తం ప.11.45 నుండి 12.33 వరకు, అమృతఘడియలు… ఉ.11.22 నుంచి 1.02 వరకు.

సూర్యోదయం : 6.17
సూర్యాస్తమయం : 6.04
రాహుకాలం : ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుంచి 9.00 వరకు

మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పోటీపరీక్షలలో విజయం. వాహనయోగం. ఆహ్వానాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగోన్నతి.

వృషభం: కుటుంబసభ్యులతో తగాదాలు. ధనవ్యయం. దూరప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

మిథునం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు.

కర్కాటకం: పనులలో అవాంతరాలు. సేవాకార్యక్రమాలు చేపడతారు. విలువైన సమాచారం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.

సింహం: కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కన్య: పనులలో అవాంతరాలు. ఆరోగ్యభంగం. కుటుంబంలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ. మానసిక అశాంతి.

తుల: సన్నిహితులతో మాటపట్టింపులు. అనుకోని ధనవ్యయం. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాలు.

వృశ్చికం: కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వస్తులాభాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. ప్రయాణాలలో అవాంతరాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు.

మకరం: మిత్రులతో సఖ్యత. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. ఆధ్యాత్మిక చింతన.

కుంభం: పనుల్లో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. బంధువులతో వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు.

మీనం: ఆర్థికాభివృద్ధి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పాతమిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి