నేటి పంచాంగం.. నేటి మాట…

🙏సర్వేజనా సుఖినోభవంతు 🙏

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 28 – 11 – 2023,
వారం … భౌమ వాసరే ( మంగళవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – శరదృతువు,
కార్తీక మాసం – బహళ పక్షం,

తిథి : పాడ్యమి మ1.40 వరకు,
నక్షత్రం : రోహిణి మ1.55 వరకు,
యోగం : సిద్ధం రా11.14 వరకు,
కరణం : కౌలువ మ1.40 వరకు,
తదుపరి తైతుల రా1.39 వరకు,

వర్జ్యం : ఉ.శే.వ7.29వరకు &
రా7.38 – 9.17,
దుర్ముహూర్తము : ఉ8.28 – 9.13 &
మ10.30 – 11.22,
అమృతకాలం : ఉ10.42 – 12.18 &
తె5.27 నుండి,
రాహుకాలం : మ3.00 – 4.30,
యమగండo : ఉ9.00 – 10.30,
సూర్యరాశి : వృశ్చికం,
చంద్రరాశి : వృషభం,
సూర్యోదయం : 6.15,
సూర్యాస్తమయం: 5.20,

*_నేటి మాట_*

*దైవాన్ని – ఎలా దర్శించుకోవచ్చు??*

ప్రపంచం మిథ్య , ఇక్కడ మనము చూస్తున్నది అంతా మాయ!
మన కళ్ళతో చూసేది ఏదీ శాశ్వతం కాదు!
అసలు మన కండ్లే శాశ్వతం కానపుడు వాటితో చూసేవి ఎట్లా శాశ్వతం అవుతాయి?!

బాహ్యేంద్రియాలు కేవలం భ్రమను మాత్రమే కలిగిస్తాయి, సత్యాన్ని చూడాలంటే మనము అంతర్ దృష్టి అలవర్చుకోవాలి.

భగవంతుడు నిత్య సత్యమైనవాడు, ఆయనను చూడాలంటే మనోదృష్టితోనే సాధ్యం.
మనము దేవుడు ప్రత్యక్షం అవ్వాలని అనుకుంటూ ఉంటాము, నిజానికి దేవుడు మన ముందు ప్రత్యక్షం అయినా కూడా మనము మన బాహ్య కళ్ళతో ఆయనను చూడలేము…!!
చూడలేని దానికోసం ఎందుకు తపన?
మన లో అంతర్ దృష్టి ఉంటే దేవుడు ప్రత్యక్షం కాకున్నా కూడా మనము ఆయనను దర్శించగలము…
అంతర్ దృష్టి వలన దైవము మనకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు మన ముందు నిలబడతాడు.
మనతో మాట్లాడుతాడు, మనతో కలిసి నవ్వుతాడు…
మనము అడిగింది ఇస్తాడు, మనకు ఏమి కావాలన్నా చేస్తాడు.
కనుక ముందు బాహ్యాన్ని తగ్గించుకోవాలి….
* అంతర్ దృష్టిని అభివృద్ది చేసుకోవాలి, దైవమును అంతరాత్మలో ప్రతిష్టించుకుని ఆరాధించాలి… ”

——————-
🌻 *మహనీయుని మాట*🍁
————————-
“సూర్యుడు ఒక్క పగలు మాత్రమే దారి చూపగలడు. కానీ నమ్మకం మరియు ఆత్మవిశ్వాసం మాత్రం జీవిత గమ్యమంతా వెలుగును విరజిమ్ముతూనే ఉంటాయి.”
————————–
🌹 *నేటి మంచి మాట* 🌼
—————————
“మనం మనకోసం చేసుకునేది మనతోనే అంతరించి పోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది.”

🛕🪔🛕🪔🛕🪔🛕🪔🛕🪔
*_🌷శుభమస్తు🌷_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏